VK Sasikala Meets Superstar Rajinikanth at his Chennai residence: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ... హీరో రజనీకాంత్‌ను కలిశారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో ( Poes Garden) రజనీకాంత్ నివాసంలో సూపర్ స్టార్‌ను కలిశారు చిన్నమ్మ. వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. రజనీ ఇటీవల దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డ్‌ను (Dadasaheb Phalke award) అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్నమ్మ.. రజనీకి అభినందనలు తెలిపారు. అలాగే సూపర్‌స్టార్ (Superstar Rajinikanth) ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆమె ఆరా తీశారు. అలాగే రజనీ భార్య లతతో కూడా ఆమె ముచ్చటించారు.
అయితే తమిళనాడబు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాను రాజకీయాల్లోకి రానంటూ సంచలన ప్రకటన చేసిన రజనీకాంత్‌ను (Rajinikanth) ఇప్పుడు శశికళ ( Sasikala) కలవడంతో రాజకీయంగా పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే వారి భేటీలో రాజకీయ ప్రాధాన్యత లేదని శశికళ వర్గీయులు అంటున్నారు. ఇది కేవలం మర్యాద పూర్వక భేటీ అని పేర్కొన్నారు.
Also Read : Flipkart Sale: రూ.30 వేల కంటే తక్కువ ధరతో iPhone 12 మీ సొంతం చేసుకోండి!
ఇక తమిళనాడు ఎలక్షన్స్ (Tamil Nadu Elections) ముందు సైలెంట్‌గా ఉన్న శశికళ, ఇప్పుడు మళ్లీ పాలిటిక్స్‌లో యాక్టివ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో శశికళ, రజనీని కలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. శశికళ వర్గీయులు కేవలం మర్యాద పూర్వక భేటీ అని చెబుతున్నా.. ఇది సరికొత్త రాజకీయ పరిణామాలకు నాంది అనే ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇక అన్నాడీఎంకే (AIADMK) సమన్వయకర్తగా పన్నీర్ సెల్వం.. సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో శశికళ కొత్త రాజకీయ పార్టీని స్థాపించే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. తన కొత్త పార్టీకి మద్దతు పలకమని కోరేందుకే శశికళ (Sasikala) రజనీని కలిసినట్లు వినికిడి.
Also Read : అక్కడ నాలుగున్నర రోజులే పనిదినాలు.. శుక్రవారం మధ్యాహ్నం నుంచే వీకెండ్ మొదలు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Sasikala meets Rajinikanth : రజనీకాంత్‌ను కలిసిన శశికళ, రాజకీయ మద్దుతు కోసమేనా?
రజనీకాంత్‌ను కలిసిన అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ
చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో రజనీకాంత్ నివాసంలో సూపర్ స్టార్‌ను కలిసిన చిన్నమ్మ
శశికళ కొత్త రాజకీయ పార్టీని స్థాపించే అవకాశం ఉందంటూ వార్తలు