Omicron Third Wave: కరోనా మహమ్మారి ముప్పు పొంచి ఉంది. ఎప్పట్నించో భయపెడుతున్న కరోనా థర్డ్‌వేవ్ ఇదేనా అంటే అవుననే సమధానం విన్పిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో థర్డ్‌వేవ్ హెచ్చరికలు కేంద్రమే జారీ చేయడం ఇందుకు కారణం.
కరోనా మహమ్మారి ముప్పు ఇప్పట్లో వీడే పరిస్థితి కన్పించడం లేదు. కరోనా మొదటి దశ కంటే సెకండ్ వేవ్ ఎక్కువ ప్రమాదాన్ని మిగిల్చింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి కరోనా ధర్డ్‌వేవ్ హెచ్చరికలు భయపెడుతూ వచ్చినా..ఆ తరువాత అదృష్టవశాత్తూ కరోనా కేసులు దాదాపుగా తగ్గిపోయాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఒక్కసారిగా కరోనా కొత్త వేరియంట్ దాడి ఆందోళన రేపింది. భయాందోళనకు దారి తీసింది.
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant)ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 48 దేశాలకు విస్తరించింది. ఇండియాలో ప్రవేశించి వారం రోజులు తిరగకుండానే మొత్తం కేసుల సంఖ్య 26కు చేరుకుంది. ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఎప్పట్నించో ఇండియాను భయపెడుతున్న కరోనా థర్డ్‌వేవ్ ఇదేనని అన్పిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో దేశంలో కరోనా థర్డ్‌వేవ్ రావచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పుడీ భయమే దేశంలో ఆందోళన కల్గిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే కోణంలో హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఒమిక్రాన్ రూపంలో కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave)వచ్చే అవకాశాల్ని కొట్టిపారేయలేమని కేంద్ర ప్రభుత్వం(Central government) తేల్చి చెప్పింది. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను(Omicron) మూడవ దశగా అనుమానిస్తున్నారు. జనవరి-ఫిబ్రవరి నెలల్లో ఇండియాలో ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. రెండవదశలో డెల్టా వేరియంట్ ఎలా విజృంభించిందో..అదే విధంగా ఒమిక్రాన్ మూడవదశలో(Corona Third Wave)విజృంభించవచ్చని అంచనా. డెల్టా వేరియంట్(Delta Variant) కంటే ఎక్కువ వేగంతో సంక్రమించే ఒమిక్రాన్‌తో జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికలు జారీ చేసింది కేంద్రం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి జిల్లా కేంద్రంలో టెలీ వైద్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో కొత్తగా క్రిటికల్ కేర్ యూనిట్ బెడ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అన్ని మెట్రో స్థాయి నగరాల్లో వ్యాధి నిర్దారణ ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని సూచించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ వన్‌హెల్త్ సెంటర్లను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ధేశించింది.
చిన్నారులకు సంబంధించి మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ ఎదుర్కొనేందుకు వివిధ రకాల మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఆక్సిజన్ ప్లాంట్ల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు ఆర్ధిక సహాయం అందుతుందని హామీ ఇచ్చింది. సంక్రాంతి తరువాత కేసులు పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook