ఆస్కార్ అప్‌డేట్స్ : బాలీవుడ్ నటుడు ఆస్కార్స్‌కి వెళ్లడం లేదట!

అస్కార్ అవార్డ్స్ షోలో పాల్గొనడం లేదన్న అలీ ఫజల్. 

Last Updated : Mar 3, 2018, 10:36 AM IST
ఆస్కార్ అప్‌డేట్స్ : బాలీవుడ్ నటుడు ఆస్కార్స్‌కి వెళ్లడం లేదట!

బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ తన గాళ్ ఫ్రెండ్ రిచా చడ్డాతో కలిసి ఆస్కర్స్‌లో పాల్గొననున్నాడు అని వస్తున్న వార్తల్ని అలీ ఫజల్ కొట్టిపారేశాడు. ప్రస్తుతం తాను లాస్ ఏంజెల్స్‌కి తన తర్వాతి సినిమా షూటింగ్ కోసం వచ్చానని, లాస్ ఏంజెల్స్‌లో వున్నంత మాత్రాన్నే ఆస్కార్స్‌కి హాజరవడానికే వచ్చానని అనుకుంటే పొరపాటేనని అభిప్రాయపడిన ఫజల్.. కాకపోతే ఆస్కార్స్ కోసం తన సినిమా తరపున ఓ బృందం మాత్రం అక్కడికి వెళ్తుందని స్పష్టంచేశాడు. 90వ అకాడమి అవార్డ్స్ సెరెమనీలో ఫజల్ నటించిన విక్టోరియా అండ్ అబ్ధుల్ అనే సినిమా బెస్ట్ కాస్ట్యూమ్, బెస్ట్ మేకప్ అండ్ హేర్ స్టైలింగ్ లాంటి రెండు కేటగిరీల్లో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

హాలీవుడ్ నటి జుడి జెంచ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా శ్రబాని బసు రచించిన నవల ఆధారంగా తెరకెక్కింది. జుడి క్వీన్ విక్టోరియా పాత్రలో నటించగా అలీ ఫజల్ అబ్ధుల్ పాత్రను పోషించాడు. 

Trending News