Indonesia Earthquake: ఇండోనేషియాలో 7.6 తీవ్రత భారీ భూకంపం- సునామీ హెచ్చరికలు జారీ

Earthquake in Indonesia: మంగళవారం తెల్లవారుజామున ఇండోనేషియాలో భారీ భూకంపం (Earthquake Today) సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.6 భూకంప తీవ్రత నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలను (Tsunami Warning) ఇండోనేషియా ప్రభుత్వం జారీ చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 11:30 AM IST
    • ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపం
    • రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతగా నమోదు
    • సునామీ హెచ్చరికలు జారీ చేసిన పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం
Indonesia Earthquake: ఇండోనేషియాలో 7.6 తీవ్రత భారీ భూకంపం- సునామీ హెచ్చరికలు జారీ

Earthquake in Indonesia: ఇండోనేషియాలో మంగళవారం ఉదయం భారీ భూకంపం (Earthquake Today) సంభవించింది. ఫ్లోరెస్ దీవిలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. ఈ విషయాన్ని ఫసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన ఇండోనేషియా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదే విషయాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే కూడా సమర్ధించింది. 

ఇండోనేషియాలోని మామెర్ నగరానికి 100 కిలో మీటర్ల దూరంలోని సముద్రంలో 18.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు తెలిపింది. దీంతో భూకంప కేంద్రానికి 1000 కిలోమీటర్ల పరిధిలో సముద్రపు అలలు భయంకరంగా ఎగసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ (Tsunami Warning) హెచ్చరికల కేంద్రం తెలిపింది. 

అమెరికన్ జియోలాజికల్ సర్వే అధ్యయనం ప్రకారం.. ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ, భూకంపాలు, సునామీ, కొండచరియలు విరిగి పడడం వంటి ప్రమాదాల వల్ల భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. 

ఇండోనేషియాలో చివరిసారిగా 2004లో సంభవించిన సునామీ (Tsunami Warning).. అటు ఎక్కువ ప్రాణ నష్టంతో పాటు భారీ ఆస్తి నష్టాలకు కారణమైంది. అప్పటి నివేదికల ప్రకారం సముద్రంలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సునామీ కారణంగా 2 లక్షల 20 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కేవలం ఇండోనేషియాలోనే 1,70,000 మరణాలు సంభవించడం గమనార్హం. ఇదో అత్యంత ఘోరమైన విషాదంగా (Earthquake Today) ప్రపంచ చరిత్రలో మిగిలిపోయింది.  

Also Read: World Omicron Alert: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్

Also Read: Ecuador Bus Accident: ఈక్వెడార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం...బస్సు బోల్తా పడి...18 మంది దుర్మరణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News