Telangana Minister KTR Congratulates NCA Director VVS Laxman: జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా హైదరాబాద్ సొగసరి, టీమిండియా మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బెంగళూరులోని ఎన్సీఏ ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్ సోమవారం విధుల్లో చేరారు. టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో.. ఎన్సీఏ డైరెక్టర్‌గా లక్ష్మణ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌కు సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
'జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా కొత్త బాధ్యతలు చేపట్టిన సోదరుడు వీవీఎస్ లక్ష్మణ్‌కు అభినందనలు. జెంటిల్మెన్ అయిన నీతో పాటు.. రాహుల్ ద్రవిడ్ సారధ్యంలో భారత క్రికెట్ మరింత గొప్పగా, అద్భుతంగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందనే నమ్మకం నాకు ఉంది' అని కేటీఆర్ మంగళావారం ట్వీట్ చేశారు. ఇద్దరు సీనియర్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ సలహాలతో భారత్ క్రికెట్ జట్టు అద్భుత ప్రతిభ చూపనుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Chiranjeevi: జెట్ స్పీడ్‌లో దూసుకెళుతున్న చిరంజీవి.. నేడు మరో సినిమా అనౌన్స్మెంట్! క్రేజీ కాంబో!!
ఎన్సీఏ డైరెక్టర్‌గా మెుదటి రోజు గడిచిన విధానాన్ని వీవీఎస్ లక్ష్మణ్తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. 'ఎన్సీఏలో మొదటి రోజు అద్భుతంగా గడిచింది. కొత్త సవాలు ఎదురు కానుంది. భారత క్రికెట్ భవిష్యత్ కోసం పనిచేయడం గొప్ప అవకాశం' అని హైదరాబాద్ సొగసరి పేర్కొన్నారు. త్వరలోనే అండర్ 19 ఐసీసీ ప్రపంచకప్ కోసం లక్ష్మణ్ వెస్టిండీస్ వెళ్లనున్నారు. ఇంతకుముందు గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్‌గా, బెంగాల్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా లక్ష్మణ్ పనిచేశారు. అయితే ఎన్సీఏ బాధ్యతలు చేపట్టాల్సి ఉండటంతో వీటి నుంచి ఆయన తప్పుకున్నారు.
ఎన్సీఏ (NCA) హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి మకాం మార్చాల్సి రావడంతో మొదట్లో వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ఆ పదవిని స్వీకరించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), సెక్రెటరీ జై షా.. అతడితో సుదీర్ఘ చర్చలు జరిపారు. చివరకు దాదా కోరిక మేరకు ఎన్సీఏ కోచ్ (NCA Coach) పదవిని చేపట్టేందుకు అంగీకరించారు. లక్ష్మణ్ భారత్ తరఫున 134 టెస్టులు, 86 వన్డేలు ఆడారు.
Congratulations on the new responsibility brother @VVSLaxman281 👏
I am sure with gentlemen like you and #RahulDravid at the helm of affairs, future Indian cricket will scale newer/greater heights https://t.co/92nxVA6Rz1
— KTR (@KTRTRS) December 14, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook