Pomegranate Peel Benefits: పండ్లలో దానిమ్మ కాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే దానిమ్మ పండులోని విత్తనాలతో పాటు దానిపై ఉన్న చర్మం కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగి ఉంది. అనేక ఆరోగ్య సమస్యలకు దానిమ్మ పైతొక్కు ఉత్తమ చికిత్సగా వినియోగిస్తున్నారు. అయితే ఈ దానిమ్మ పండు పై ఉన్న తొక్క వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి.
చర్మ సమస్యలు
దానిమ్మ తొక్కలో సన్ స్క్రీన్ లోషన్ వంటి గుణం ఉంటుంది. సూర్య కిరణాల నుంచి వచ్చే మీ చర్మానికి హానికరమైన అల్ట్రా వేవ్ కిరణాల నుంచి దానిమ్మ తొక్కు రక్షణ ఇస్తుంది. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
సన్ స్క్రీన్ లోషన్ తయారు చేసుకునేందుకు.. దానిమ్మ పండు తొక్కలను ఎండిన తర్వాత వాటిని పొడి చేయాలి. ఆ మిశ్రమాన్ని క్రీమ్ లా తయారు చేసుకొని.. సన్ స్క్రీన్ లోషన్ లాగా వినియోగించవచ్చు. ఈ లోషన్ పూసుకోవడం వల్ల చర్మంపై ఉన్న ముడుతలు కూడా తగ్గుతాయి.
అదే విధంగా.. రెండు టేబుల్ స్పూన్ల పొడిని పాలతో కలిపి చర్మంపై రాసుకోవాలి. ముఖం సహా అనే ప్రాంతాల్లో ఆ మిశ్రమాన్నిపూసుకొని.. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. అలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మంపై ఉన్న జిడ్డు పోతుంది.
నోటి దుర్వాసనకు స్వస్తి
నోటి పరిశుభ్రతను కాపాడుకునేందుకు సహాయపడే అనేక లక్షణాలు దానిమ్మ తొక్కులో ఉన్నాయి. దానిమ్మ తొక్కు పొడిని నీటిలో కలిపి.. ఆ మిశ్రమాన్ని పుక్కిలిస్తే నోటి దుర్వాసన పోతుంది. దీంతో పాటు దంతాలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో దానిమ్మ పొడి గొప్పగా పనిచేస్తుంది.
గుండె సమస్యలకు..
దానిమ్మ తొక్కలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. దానిమ్మ తొక్క తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు, ఒత్తిడి తగ్గుతాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్లు.. బీపీతో పాటు ఒత్తిడిని నియంత్రించేందుకు సహాయపడతాయి.
జట్టు పోషణ కోసం..
దానిమ్మ తొక్కు పౌడర్ జట్టు రాలడాన్ని నివారించడం సహా చుండ్రు సమస్యలను తొలగిస్తుంది. దానిమ్మ తొక్కుల పొడిలో కొబ్బరినూనెను కలిపి కుదుళ్లకు మసాజ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
Also Read: Men Health Tips: పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరిగేందుకు ఇవి తినాలి!
Also Read: Cloves Side Effects: లవంగాలు ఎక్కువ తింటే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook