UK Omicron Deaths: యాకేలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) కల్లోలం సృష్టిస్తోంది. తొలి ఒమిక్రాన్ మరణం బ్రిటన్(UK)లో నమోదైన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు అక్కడే నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు బ్రిటన్ ఉప ప్రధాని డొమినిక్ రాబ్( Dominic Raab) పేర్కొన్నారు. ప్రస్తుతం 104 మంది ఒమిక్రాన్ తో ఆస్పత్రిలో చేరినట్లు ఆయన వెల్లడించారు.
దక్షిణాఫ్రికాలో తొలిసారి ఈ ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసింది. గడిచిన 24 గంటల్లో బ్రిటన్‌లో 90వేల మందికి పైగా కొవిడ్(Covid-19) బారిన పడ్డారు. అందులో 12వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఆ దేశంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 37వేలు దాటడం విశేషం. వైరస్ వ్యాప్తి నివారణకు మళ్లీ ఆంక్షలు విధించాలని బ్రిటన్ సర్కారు భావిస్తోంది. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో అక్కడ బూస్టర్ డోసు పంపిణీని వేగవంతం చేశారు.
Also Read: Omicron scare: ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో ఒమిక్రాన్ - యూకేలో మళ్లీ లాక్డౌన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook