Dance video : తండ్రీ కూతుర్ల డ్యాన్స్‌ అదుర్స్.. సింపుల్ స్టెప్స్‌తో చింపేశారు

father daughter dance video viral : తండ్రీ కూతుర్లు.. పాబ్లో, వెరోనికాల చాలా డ్యాన్స్‌ వీడియోలు సోషల్ మీడియాలో తరుచుగా వైరల్ అవుతుంటాయి. ఇక ఒక వీడియో పాతదే అయినా సోషల్ మీడియాలో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. అదేంటో చూసేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 02:35 PM IST
  • ఇంటర్నెట్ స్టార్స్‌.. పాబ్లో, ఆయన కూతురు వెరోనికా మరో అద్భుతమైన డ్యాన్స్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో
  • వీడియో పాతదే అయినా సోషల్ మీడియాలో మళ్లీ వైరల్
Dance video : తండ్రీ కూతుర్ల డ్యాన్స్‌ అదుర్స్.. సింపుల్ స్టెప్స్‌తో చింపేశారు

Viral Video: Father daughter duo dance to Bee Gees Stayin Alive, Old video goes viral Steal Hearts Online : ఇంటర్నెట్ స్టార్స్‌.. పాబ్లో, ఆయన కూతురు వెరోనికా మరో అద్భుతమైన డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. పాబ్లో, (Pablo) వెరోనికాల (Veronica) చాలా డ్యాన్స్‌ వీడియోలు సోషల్ మీడియాలో తరుచుగా వైరల్ (Viral) అవుతుంటాయి. ఇక ఒక వీడియో పాతదే అయినా సోషల్ మీడియాలో (Social media) ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. 

ఈ వీడియో వారి ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) హ్యాండిల్‌ pabloeveronica01 లో అప్‌లోడ్ చేశారు. వీరికి 690k కి పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. పాప్‌లర్‌‌ పాటలకు తమదైన స్టైల్‌లో స్టెప్స్ (Steps) వేస్తూ అందరినీ అలరిస్తుంటారు ఈ తండ్రీ కూతుర్లు. 

ఇక ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో.. వారిద్దరూ రెట్రో డిస్కో-థీమ్ డ్రెస్‌లతో ఆకట్టుకున్నారు. బీ గీస్ వారి హిట్ క్లాసిక్ పాట స్టెయిన్ అలైవ్‌ పాటకు (Bee Gees Stayin Alive) స్టెప్స్ వేశారు. వెరోనికా రెండ్ కలర్ టాప్, రెడ్ కలర్ బెల్-బాటమ్ ప్యాంట్‌లో.. పాబ్లో వైట్ షర్ట్, బ్ల్యాక్ ప్యాంట్‌ ధరించి ఈ పాటకు డ్యాన్స్ వేశారు. 

ఇక డ్యాన్స్ (Dance) వేసేటప్పుడు ఇద్దరి హావాభావాలు అదుర్స్ అంటున్నారు నెటిజెన్స్. ఒకే రీతిలో ఇద్దరూ స్టెప్స్ వేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు ఈ తండ్రీ కూతుర్లు. కూల్ గ్లాసెస్‌తో.. రెట్రో లుక్‌లో సింపుల్ స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు.

Also Read : Omicron in Maharashtra: మహారాష్ట్రలో ఒమిక్రాన్ విజృంభణ- ఒక్క రోజులో 20 కేసులు

ఇక ఈ వీడియోకు 6,230కి పైగా లైక్‌లు వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్‌లో చాలా మంది ఈ వీడియోను అభినందిస్తూ.. హార్ట్ ఎమోజీలతో తమ ఇష్టాన్ని తెలుపుతూ కామెంట్‌ చేస్తున్నారు. ఈ తండ్రీ కూతుర్లు పాబ్లో, వెరోనికా ఏ వీడియో (Video) చేసిన సూపర్బ్‌గా ఉంటుందని కాంప్లిమెంట్ ఇస్తున్నారు నెటిజెన్స్.

Also Read : Flipkart Offers: ఫ్లిప్​కార్ట్​లో రూ.20,990 స్మార్ట్​ ఫోన్​.. కేవలం రూ.1,165కే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News