Cowin Registration: చిన్నారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 1 నుంచి ప్రారంభం, ఎలాగంటే

Cowin Registration: కరోనా వ్యాక్సినేషన్ ఇకపై చిన్నారులకు సైతం అందుబాటులో వచ్చేసింది. చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ ఎప్పట్నించి, ఎలా జరుగుతుందనేది పరిశీలిద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 27, 2021, 02:02 PM IST
 Cowin Registration: చిన్నారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 1 నుంచి ప్రారంభం, ఎలాగంటే

Cowin Registration: కరోనా వ్యాక్సినేషన్ ఇకపై చిన్నారులకు సైతం అందుబాటులో వచ్చేసింది. చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ ఎప్పట్నించి, ఎలా జరుగుతుందనేది పరిశీలిద్దాం.

ఎప్పట్నించో నిరీక్షిస్తున్న చిన్న పిల్లల కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చింది. జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల చిన్నారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ (Covid Children Vaccination) ప్రక్రియ ప్రారంభం కానుందని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ప్రక్రియ కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎప్పట్నించి రిజిస్ట్రేషన్ ఉంటుందనే విషయాల్ని కోవిన్ ప్లాట్‌ఫామ్ ఛీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ వివరించారు. 15-18 ఏళ్ల వయస్సున్న చిన్నారులకు వ్యాక్సినేషన్ నిమిత్తం జనవరి 1, 2022 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. అయితే ప్రూఫ్ కోసం పదవ తరగతి ఐడీ కార్డును రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్తగా చేర్చారు. అంటే పదవ తరగతి ఐడీ కార్డును ప్రూఫ్‌గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చిన్నారులకు సహజంగా ఆధార్ కార్డు లేదా ఇతర ఐడీ కార్డులు ఉండనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుంచి 15-18 ఏళ్ల వయస్సున్నవారికి కోవిన్ యాప్‌లో (CoWin App) రిజిస్ట్రర్ చేసుకోనున్నారు. ఐడీ కార్డు ఆధార్ కూడా ఉపయోగించవచ్చని డాక్టర్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. 

ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ( How to Register)

ముందుగా ఆరోగ్య సేతు యాప్ (Aarogya Setu App) లేదా Cowin.gov.in సైట్ ఓపెన్ చేయాలి. తరువాత మొబైల్ నెంబర్‌తో లాగిన్ కావాలి. ఓటీపీ కోసం ఆప్షన్ ఎంచుకోవాలి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీను ఎంటర్ చేసి వెరిఫై బటన్ ప్రెస్ చేయాలి. ఆరోగ్య సేతు యాప్‌లో అయితే కోవిన్ ట్యాబ్‌లో వెల్లి..వ్యాక్సినేషన్ ట్యాబ్ క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అయ్యాక ఫోటో ఐడీ,  నంబర్, పూర్తి పేరు ఎంటర్ చేయాలి. పదవ తరగతి ఐడీ కార్డు కూడా ఎంచుకోవచ్చు. ఆ తరువాత జెండర్, వయస్సు ఎంటర్ చేయాలి. ఆ తరువాత Do you have any comorbidities క్లిక్ చేసి ఎస్ లేదా నో ఎంచుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక..మీ మొబైల్ నెంబర్‌కు కన్ఫామ్ మెస్సేజ్ వస్తుంది. ఒకే మొబైల్ నెంబర్‌పై నలుగురు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Also read: COVID-19 impact on Men: కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత పురుషుల్లో సంతాన లోపం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News