EPFO Portal Down: EPFO Portal Down 3 Days Ahead of e-Nomination Deadline users take to twitter to Show Disappointment: ఈపీఎఫ్‌ఓకు సంబంధించి ఈ - నామినేషన్ దాఖలు చేయడానికి డిసెంబరు 31 వరకే గడువు ఉంది. అయితే యూజర్స్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organization) వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైబ్‌సైట్ మొరాయిస్తోంది. దాదాపు వారం రోజులుగా ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో (EPFO Website) లాగిన్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక ఈ సమస్య గురించి యూజర్స్ ట్వీట్స్ (Tweets) చేస్తున్నారు.
ఈపీఎఫ్ఓ అకౌంట్ హోల్డర్స్ (EPFO Account Holders) ఈ-నామినేషన్ చేసేందుకు డిసెంబర్ 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఈ లోపే యూజర్స్ తమ ఈపీఎఫ్ అకౌంట్స్‌కు ఈ-నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది ఈపీఎఫ్ఓ. అలా చేయకపోతే నామినీలకు (Nominee) రావాల్సిన బెనిఫిట్స్ కోల్పోతారని పేర్కొంది. అయితే వెబ్‌సైట్‌లో లాగిన్ సమస్య తలెత్తుతోంది. ఇక యూజర్స్ మొత్తం ట్విట్టర్ వేదికగా ఈ సమస్యపై పోస్ట్స్ చేస్తున్నారు. ఈ-నామినేషన్‌ను (E-nomination) రిజిస్టర్ చేసుకునేందుకు ప్రత్యామ్నాయాలు కల్పించాలంటూ కోరుతున్నారు.
#EPF Members can file new nomination to change existing EPF/#EPS nomination.
ईपीएफ सदस्य मौजूदा ईपीएफ/ईपीएस नामांकन को बदलने के लिए नया नामांकन दाखिल कर सकते हैं।#EPFO #Services #Pension #ईपीएप #पीएफ pic.twitter.com/20JEbp7x65
— EPFO (@socialepfo) December 23, 2021
Not able to file e nomination. Shows error. Trying for last three days. Every time this message comes. Am I missing something??? pic.twitter.com/KrOtmByJUw
— Sanjay (@sanjay_teenu) December 24, 2021
Your team can stop this all as they are not capable to do their work.
— Bajrangkayath@gmail.com (@bajrangkayath) December 23, 2021
అయితే సమస్య త్వరలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉండడంతో.. EPFO వెబ్‌సైట్‌లో ఈ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటే మంచిది. ఈ-నామినేషన్ ప్రక్రియ కోసం కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అవి ఏమిటో చూడండి.
Also Read : Delhi on Yello Alert: ఢిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ, ఎల్లో అలర్ట్ అంటే ఏమిటి, ఆంక్షలు
1. ముందుగా EPFO వెబ్‌సైట్ https://www.epfindia.gov.in/site_en/index.php ఓపెన్ చెయ్యండి. తర్వాత SERVICE పై క్లిక్ చేయండి
2. తర్వాత ఫర్ ఎంప్లాయీస్ సెక్షన్‌పై (For Employees section) క్లిక్ చేయండి. తర్వాత, మీరు మెంబర్ UAN / ఆన్‌లైన్ సర్వీస్ ఆప్ష్‌పై క్లిక్ చేయాలి.
3. ఇప్పుడు, మీ UAN ID, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
4. ఇప్పుడు డ్రాప్ డౌన్ మెనులో MANAGE ట్యాబ్‌కి వెళ్లి E-నామినేషన్‌ను ఎంచుకోండి.
5. ఇప్పుడు YES ఎంపికను ఎంచుకుని, ఫ్యామిలీ డిక్లరేషఫన్ అప్‌డేట్ చేయండి.
6. యాడ్ ఫ్యామిలీ డిటేల్స్ (Add Family Details) పై క్లిక్ చేయండి. అక్కడ నామినేషన్ వివరాలను ఎంచుకోండి, తర్వాత ఒక్కో నామినీకి ఎంత అమౌంట్ షేర్ చేయాలో ఆ మొత్తాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది.
6. ఇప్పుడు సేవ్ ఈపీఎఫ్ నామినేషన్ పై (Save EPF nomination) క్లిక్ చేయండి.
7. తర్వాత పేజీలో, ఇ-సైన్ ఆప్షన్‌పై (e-sign option) క్లిక్ చేయండి.
7. మీ ఆధార్ కార్డ్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
8. మీరు OTPని ఎంటర్ చేసి, సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే చాలు..మీ నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
Also Read : Xiaomi 12 series: మార్కెట్‌లోకి షియోమి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు.. ధరలు మాత్రం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి