ప్రత్యేక హోదా అంశం ఢిల్లీ రాజకీయలను ప్రభావితం చేసే దిశగా కదులుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపై పోరుబాట పట్టాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ, వైపీపీ, కాంగ్రెస్ ఎంపీలు తమదైన శైలిలో నిరసనలు తెలుపుతున్నాయి. ఈ ఉదయం టీడీపీ ఎంపీలు గాంధీ విగ్రహం ముందు నిలబడి ప్లకార్డులు పట్టుకుని ఏపీకి తక్షణం ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిన్న హోదా అంశంపై ఢిల్లీలో మహాధర్నా చేపట్టిన వైసీపీ రెండో రోజు కూడా తమ ఆందోళనను కొనసాగిస్తోంది. మరోవైపు ఆంధ్రుల ఆత్మ గౌరవ దీక్ష పేరుతో మూడు రోజుల పాటు దీక్షలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఏపీకి ప్రత్యేక హోదాపై వెంటనే చర్చించాలని పలు పార్టీలు లోక్ సభ, రాజ్యసభల్లో వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి.