Hansika: టాలీవుడ్ అమూల్ బేబీ హన్సిక చేతిలో వరుస సినిమాలు

Hansika: ఉత్తరాది నుంచి టాలీవుడ్‌కు హన్సిక ఇటీవలి కాలంలో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంటోంది. ఈసారి ఏకంగా 9 సినిమా ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 5, 2022, 08:39 AM IST
 Hansika: టాలీవుడ్ అమూల్ బేబీ హన్సిక చేతిలో వరుస సినిమాలు

Hansika: ఉత్తరాది నుంచి టాలీవుడ్‌కు హన్సిక ఇటీవలి కాలంలో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంటోంది. ఈసారి ఏకంగా 9 సినిమా ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి.

తెలుగు, తమిళ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అమూల్ బేబీ ముద్గుగుమ్మ హన్సికకు అభిమానులు ఎక్కువే. అందంతో పాటు అభినయం కూడా ఉన్న నటి కావడంతో ఆమెకు టాలీవుడ్‌లో మంచి పేరే ఉంది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సక్సెస్ సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యన కొద్దికాలంగా పెద్దగా తెలుగు సినిమాల్లో కన్పించడం లేదు. అయితే ఆఫర్లు మాత్రం వరుసగా ఉన్నాయంటోంది హన్సిక (Hansika). ఒకటి కాదు రెండు ఏకంగా 9 ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. మహా, మై నేమ్ ఈజ్ శృతి, రౌడీ బేబీ, పార్ట్‌నర్ సినిమాలతో పాటు ఒక ఓటీటీ ప్రాజెక్టు చేతిలో ఉందని తెలుస్తోంది. ఇవి కాకుండా మరో మూడు సినిమాలున్నాయి. అందుకే 2022 కొత్త ఏడాదికి తనకెంతో ప్రత్యేకమంటోంది హన్సిక. గత రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా చలనచిత్ర పరిశ్రమ చాలా దెబ్బతింది. క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఈ ఏడాది పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నానంటోంది హన్సిక. తన వరకూ వస్తే 9 సినిమాలు చేతిలో ఉన్నాయని చెబుతోంది. ఇందులో కొన్ని షూటింగ్ దశలో ఉంటే..కొన్ని విడుదలకు సిద్ఘంగా ఉన్నాయి.

Also read: God Father Movie: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ షూటింగ్ అప్‌డేట్స్..విడుదల ఎప్పుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News