Whatsapp New Feature: వాట్సప్ ఐవోఎస్ యూజర్ల కోసం తొలి బీటా ఫీచర్ విడుదల చేసింది. ఈ కొత్త సౌకర్యంతో ఇకపై ఐఫోన్ యూజర్లు కూడా ప్రొఫైల్ ఇమేజ్ చూసే వెసులుబాటు ఉంటుంది.
వాట్సప్ కొత్త సౌలభ్యం ఇక నుంచి ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులో రానుంది. ఐవోఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ కోసం కొన్ని బీటా టెస్టర్లకు మాత్రమే వెసులుబాటు ఉంటుంది. వాట్సప్ ఫీచర్ బీటా ఫేజ్‌లో ఉండటం వల్ల ప్రొఫైల్ పిక్స్ డిస్‌ప్లేలో సమస్య ఎదురవుతోంది. అయితే కొత్త ఫీచర్ అందుబాటులో వచ్చాక ఈ సమస్య తొలగిపోతుంది.
వాట్సప్ (Whatsapp) కొత్త ఫీచర్ బీటా అప్‌డేట్ 2.22.1.1 ను ఐవోఎస్ యూజర్లకు ప్రవేశపెట్టింది. ఫలితంగా యూజర్లు కమ్యూనిటీ క్రియేట్ చేసుకోగలరు. ఇప్పటికే రెండు వారాల క్రితమే ఆండ్రాయిడ్ కోసం వాట్సప్ ఈ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ప్రకారం వాట్సప్‌లో కమ్యూనిటీకు ఓ పేరు, వివరణ ఉంటుంది.పేరు, వివరణ ఎంటర్ చేసిన తరువాత కొత్త గ్రూప్ క్రియేట్ చేసుకునేందుకు లేదా పది గ్రూప్స్‌తో లింక్ చేసేందుకు అవకాశముంటుంది. ఎనౌన్స్‌మెంట్ గ్రూప్ కూడా కమ్యూనిటీలో కన్పిస్తుంది. అడ్మిన్స్ కోసం వాట్సప్ ఈ గ్రూప్‌ను ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తుంది. ఈ గ్రూప్ ఆధారంగా గ్రూప్ అడ్మిన్స్ ఇక నుంచి లింక్డ్ గ్రూప్స్‌కు మెస్సేజ్ పంపించుకోవచ్చు.
Also read: Tamilnadu Blast: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు...నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి