Malaika Arora - Arjun Kapoor: మరో స్టార్ కపుల్ బ్రేకప్.. షాకింగ్ కౌంటర్ ఇచ్చిన హీరో!!

బ్రేకప్ వార్తలపై అర్జున్ కపూర్ స్పందిస్తూ షాకింగ్ రిప్లై ఇచ్చారు. మలైకాతో ఉన్న ఓ స్టైలిష్ పిక్ పోస్ట్ చేసి నీచమైన పుకార్లు నమ్మొద్దు అని ట్వీట్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 10:01 AM IST
  • స్టార్ కపుల్ బ్రేకప్ అంటూ రూమర్లు
  • అర్జున్ కపూర్-మలైకా అరోరా బ్రేకప్
  • షాకింగ్ కౌంటర్ ఇచ్చిన హీరో
Malaika Arora - Arjun Kapoor: మరో స్టార్ కపుల్ బ్రేకప్.. షాకింగ్ కౌంటర్ ఇచ్చిన హీరో!!

 Arjun Kapoor - Malaika Arora's rumoured breakup went viral: సినీ ఇండస్ట్రీలో ఇటీవలి కాలంలో తమ వైవాహిక జీవితంకు గుడ్ బై చెపుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. హృతిక్ రోషన్ - సుసాన్ ఖాన్, అమీర్ ఖాన్ - కిరణ్ రావు, అక్కినేని నాగ చైతన్య - సమంతలు ఇప్పటికే విడాకులు తీసుకుని ఎవరిదారి వారు చూసుకున్నారు. తాజాగా మరో స్టార్ కపుల్ బ్రేకప్ అంటూ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. నాలుగు సంవత్సరాల పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా (Arjun Kapoor - Malaika Arora) విడిపోయారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.

గత కొన్ని ఆరు రోజులుగా మలైకా అరోరా (Malaika Arora) తన ఇంటి నుంచి బయటకు రాలేదని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. మలైకా ఒంటరిగా మరియు చాలా విచారంగా ఉన్నారట. అర్జున్ కపూర్ (Arjun Kapoor), రియా కపూర్‌ కలిసి మూడు రోజుల క్రితం డిన్నర్ పార్టీకి వెళ్లగా.. అక్కడ కూడా మలైకా లేరట. రియా ఇల్లు మలైకా ఇంటికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ.. డిన్నర్ తర్వాత అర్జున్ ఆమెను కలవలేదట. మలైకా సాధారణంగా అర్జున్ ఫ్యామిలీ డిన్నర్‌లకు అర్జున్‌తో కలిసి హాజరవుతుంటారు. కానీ తాజాగా అర్జున్ ఫ్యామిలీతో మలైకా కలవడం లేదని వార్తల సారాంశం. దాంతో స్టార్ కపుల్ అర్జున్‌ - మలైకా బ్రేకప్ (Arjun Kapoor - Malaika Arora Breakup ) అనే వార్త నెట్టింట హల్చల్ చేసింది. 

Also Read: Jasprit Bumrah vs Marco Jansen: మార్కో.. బుమ్రా అంటే ఫ్లవర్ అనుకుంటివా?.. ఫైరూ! తగ్గేదేలే!!

ఈ వార్తలపై అర్జున్ కపూర్ స్పందిస్తూ షాకింగ్ రిప్లై ఇచ్చారు. మలైకాతో ఉన్న ఓ స్టైలిష్ పిక్ పోస్ట్ చేసి నీచమైన పుకార్లు నమ్మొద్దు అని ట్వీట్ చేశారు. 'నీచమైన పుకార్లకు అస్సలు స్థానం లేదు. సురక్షితంగా ఉండండి. ఆశీర్వాదంతో ఉండండి. ప్రజలకు శుభాకాంక్షలు. అందరినీ ప్రేమిస్తున్నాను' అంటూ రూమర్లకు కౌంటర్ ఇచ్చారు. మలైకాతో ఉన్న మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేయడం ద్వారా వీరిద్దరూ విడిపోతున్నారన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం అయింది. అర్జున్ పోస్ట్‌పై మలైకా కూడా స్పందించారు. హార్ట్ ఎమోజీ పోస్ట్ చేసి తమ మధ్య బంధం బాగుందని పేర్కొన్నారు. తారా సుతారియా, భూమి పెడ్నేకర్, అమృత అరోరా, సోఫీ చౌదరి, అతియా శెట్టి, తాహిరా కశ్యప్ మరియు అమీ జాక్సన్ కూడా అర్జున్ పోస్ట్‌పై స్పందించారు.

 
 
 
 
 

ముంబై నగరంలో పెరుగుతున్న కరోనా (Coronavirus) కేసుల కారణంగా మలైకా అరోరా బయటకు వెళ్లడం లేదని తెలుస్తోంది. అర్జున్ కపూర్,  అన్షులా కపూర్, రియా కపూర్, కరణ్ బూలానీలకు కొన్ని వారాల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో క్వారంటైన్‌లో ఉన్నారు. మలైకా కూడా వారితో తిరిగినా.. ఆమెకు మాత్రం కరోనా సోకలేదు. ఇక అర్జున్ కపూర్ 'ది లేడీ కిల్లర్' (The Lady Killer) అనే చిత్రంలో నటిస్తున్నారు. అజయ్ బహ్ల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) కథానాయికగా నటిస్తున్నారు. 

Also Read: రంగంలోకి మెగాస్టార్... నేడు సీఎం జగన్‌తో భేటీ.. సినిమా టికెట్ ధరల వివాదం కొలిక్కి వచ్చేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

Trending News