/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం (Budget Session of Parliament ) కానున్నాయి. ఏప్రిల్​ 8 వరకు పార్లమెంట్ ఉభయ సభలు పని (Parliament Budget Session dates) చేయనున్నాయి. ఈ సారి కూడా రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి దశ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనుంది. ఆ తర్వాత మార్చి 14న రెండో దశ సమావేశాలు ప్రారంభమై ఏప్రిల్ 8న ముగియనున్నాయి.

ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్​ను (Union Budget 2022) ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పిటికే అన్ని ఇతర శాఖల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే హల్వా కార్యక్రమం ద్వారా బడ్జెట్ ప్రతులను ముద్రించే ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వివరాలు..

కరోనా మూడో దశ భయాల నేపథ్యంలో బడ్జెట్​ సమవేశాలు నిర్వహించాల్సి అవసరం ఏర్పడింది. అయితే ఇప్పటికే 400 మందికిపైగా పార్లమెంట్ సిబ్బంది కొవిడ్ బారిన పడిన నేపథ్యంలో.. షిఫ్డుల వారీగా ఉభయ సభలు నిర్వహించే అంశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. రాజ్య సభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుందని... లోక్ సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగొచ్చని తెలిసింది. బడ్జెట్ రోజు మాత్రం ఇందుకు మినహాయిపు ఉండనుంది.

కరోనా నిబంధనలు కట్టుదిట్టం..

దేశంలో ఇటీవల కరోనా కేసులు భారీగా (Corona in Parliament) పెరుగతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి సెషన్​లో కూడా కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. భౌతిక దూరం పాటించడం, మాస్క్​లు ధరించడం వంటి నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు (Corona rules in Budget Session 2022) సమాచారం.

Also read: PM Modi: అందరికీ భోగి శుభాకాంక్షలు.. ప్రజలందరి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నా: మోదీ

Also read: Archana Gautam - Congress Ticket: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. మిస్ బికినీకి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Budget Session of Parliament to commence from January 31 introduction of Budget 2022 on Feb 1
News Source: 
Home Title: 

Parliament Budget Session: ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Parliament Budget Session: ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
Caption: 
Budget Session of Parliament to commence from January 31 introduction of Budget 2022 on Feb 1 (Parliament building file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఈ నెలాఖరు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్​

ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్న సమావేశాలు

షిఫ్డుల వారీగా ఉభయ సభలు పని చేసే అవకాశం!

Mobile Title: 
Parliament Budget Session: ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ZH Telugu Desk
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, January 14, 2022 - 13:10
Request Count: 
52
Is Breaking News: 
No