ISRO new chief: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) నూతన ఛైర్మన్‌గా నియమింతులైన.. ఎస్ సోమనాథ్ నేడు బాధ్యతలు స్వీకరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కార్యదర్శిగా, స్పేస్ కమిషన్ ఛైర్మన్‌గా ఎస్ సోమనాథ్ శుక్రవారం బాధ్యతలు (ISRO new Chairman) చేపట్టినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
ఇక 2018 జనవరి నుంచి ఇస్రో ఛైర్మన్‌గా సేవలందించిన కె.శివన్ పదవీ (K Sivan ISRO) కాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఇస్రో ఘన వీడ్కోలు పలికింది.
ఇస్రో ఛైర్మన్‌గా పదోన్నతి పొందక ముందు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరక్టర్‌గా ఎస్ సోమనాథ్ సేవలు అందించారు.
నేటి నుంచి మూడేళ్ల పాటు ఇస్రో కార్యదర్శి, ఛైర్మన్ స్థానాల్లో ఆయన కొనసాగనున్నారు. 1985లో వీఎస్‌ఎస్‌సీలో చేరిన సోమనాథ్.. ఉపగ్రహ వాహకనౌకల డిజైనింగ్‌లో కీలక పాత్ర పోషించారు. లాంచ్ వెహికిల్ సిస్టమ్ ఇంజనీరింగ్‌లో సోమనాథ్ నిపుణులు.
సోమనాథ్ గురించి..
కేరళలో కొల్లంలోని టీకేఎం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు సోమనాథ్. మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఆయన బీటెక్ పట్టా పొందారు. ఆ తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆయనకు ఇందులో గోల్డ్ మెడల్ రావడం గమనార్హం.
1985లో వీఎస్ఎస్వీలో చేసిన సమయంలో.. పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ ప్రాథమిక దశలో టీమ్ లీడర్‌గా (About S Somanath) వ్యవహరించారు. ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఆయన గోల్డ్ మెడల్ పొందటం విశేషం.
Also read: Six Airbags for Cars: కార్లలో 6 ఎయిర్ బ్యాగ్‌లు తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం!
Also read: PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కుటుంబంలో ఎంతమందికి వర్తిస్తుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
ISRO new chief: సోమనాథ్‌కు ఇస్రో పగ్గాలు.. ముగిసిన శివన్ శకం
ఇస్రో ఛైర్మన్ ముగిసిన శివన్ శకం
నేడు ఆ పదవిని చేపట్టిన సోమనాథ్
మూడేళ్ల వరకు పదవి కాలం