Mood Of The Nation poll: తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి (Telangana elections) రెండవ సారి విజయం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎదరులేని శక్తిగా ఎదుగుతున్న సమయంలో.. బీజేపీ నుంచి గట్టి (Telangana BJP) పోటీ ఎదురైంది.
సార్వత్రిక ఎన్నికలు మొదలుకుని జీహెచ్ఎసీ ఎన్నికల వరకు బీజేపీ అనుకోని విధంగా పుంజుకుంది. దుబ్బాక సహా గత ఏడాది జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్పై ఘన విజయం సాధించి (Huzurabad by election) సత్తా చాటుకుంది.
అయితే ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఓ సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఇండియా టుడే- సీ ఓటర్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో (Mood Of The Nation poll 2022) నిర్వహించిన.. ఇటీవలి సర్వేలో తెలంగాణలో బీజేపీ క్రమంగా పుంజుకుంటున్నట్లు తెలిసింది. అయితే బీజేపీ పుంజుకోవడం కాంగ్రెస్‌కు మాత్రమే కాదు.. అధికా టీఆర్ఎస్కు గట్టి ఎదురు దెబ్బేనని సర్వే అంచనా (C Voter India Today Survey) వేసింది.
ఎన్నికలు వస్తే.. బీజేపీ హవా..
రాష్ట్రంలో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీ 6 లోక్ సభ సీట్లను గెలుస్తుందని సర్వే అంచనా వేసింది. ఇక టీఆర్ఎస్ (TRS Party) 8, కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకుంటాయని (MOTN survey) తెలిపింది.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. బీజేపీ 2 సీట్లు అదనంగా గెలుస్తుందని.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఒక్కో సీటు కోల్పోయే అవకాశముందని సర్వే అభిప్రాయపడింది.
ముందస్తు ఎన్నికలు వస్తాయా?
సర్వేల మాట అటుంచితే.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావచ్చని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ విషయంపై స్పందించడం గమనార్హం.
గతంలో కూడా 2019లో జరగాల్సిన ఎన్నికలను.. 2018లోనే జరిగిన విషయం (Early elections in Telangana) తెలిసిందే.
Also read: Telangana: తెలంగాణలో మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు... పెరగనున్న భూముల ధరలు
Also read: Telangana Covid Tests: TRS సర్కార్ ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది: సోషల్ మీడియాలో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook