Mohammad Rizwan won T20I Cricketer of the Year Award: క్రికెట్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 'టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా (T20I Cricketer of the Year Award) పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) ఎంపికయ్యాడు. ఇక ఇంగ్లండ్ వికెట్ కీపర్ ట్యామీ బ్యూమోంట్ (Tammy Beaumont) ఐసీసీ 'ఉమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఐసీసీ ఆదివారం ప్రకటించింది. 'టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయిన ఇద్దరు ప్లేయర్స్ వికెట్ కీపర్లు కావడమే విశేషం.
2021లో మొహ్మద్ రిజ్వాన్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది 29 టీ20 మ్యాచ్‌లు ఆడిన రిజ్వాన్.. 1326 పరుగులు సాధించాడు. 134.89 స్ట్రైక్ రేట్, 73.66 సగటుతో ఈ రన్స్ చేయడం విశేషం. గతేడాది జరిగిన ప్రపంచకప్‌లోనూ రిజ్వాన్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ.. పరుగుల వరద పారించాడు. లీగ్ మ్యాచుల్లో పరుగుల సునామి సృష్టించి పాక్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రిజ్వాన్ నిలిచాడు. లాహోర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి.. టీ20ల్లో కెరీర్లోనే తొలి శతకం నమోదు చేసుకున్నాడు.
Also Read: IND vs PAK: వారిద్దరూ రాణించకపోతే.. టీమిండియాపై ఒత్తిడి తప్పదు: హఫీజ్
Sheer Consistency, indomitable spirit and some breathtaking knocks 🔥
2021 was memorable for Mohammad Rizwan 👊
More 👉 https://t.co/9guq9xKOod pic.twitter.com/6VZo7aaRIA
— ICC (@ICC) January 23, 2022
బ్యాటింగ్‌లో అత్యుత్తమంగా రాణించిన ఇంగ్లండ్ వికెట్ కీపర్ ట్యామీ బ్యూమోంట్ ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సిరీస్‌లో ఆమె టాప్ స్కోరర్‌గా నిలిచారు. మూడు మ్యాచుల్లో 102 పరుగలు చేశారు. టీమిండియాతో జరిగిన ఓ మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ బాదారు. ఇంగ్లండ్ గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మరో సిరీస్‌లోనూ 113 అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచారు.
ఈ రెండు పురస్కారాలతో పాటు ఐసీసీ మరిన్నింటిని ప్రకటించింది. పురుషుల ఎమర్జింగ్ ప్లేయర్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు జాన్నెమన్ మలన్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. అసోసియేట్ క్రికెటర్‌గా ఒమన్ ఆల్‌రౌండర్ ఆటగాడు జీషన్ మక్సూద్ను ఎన్నుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో జట్టుకు ఉత్తమ సేవలందించినందుకు గానూ ఈ పురస్కారాన్ని ఐసీసీ అందజేయనుంది.
Also Read: Samantha Item Song: మరో పాన్ఇండియా మూవీలో ఐటెం సాంగ్ కు 'ఊ' కొట్టిన సమంత!
Match-winning knocks, brisk starts and some memorable moments ✨
Take a bow, Tammy Beaumont 🙇
More 👉 https://t.co/Q32mIXUBoQ pic.twitter.com/uB6dRWKMeU
— ICC (@ICC) January 23, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook