Dhawan-Kohli surpass Dhoni-Raina's Record: మూడు వన్డే మ్యాచుల సిరీసులో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మూడో వన్డే (IND vs SA 3rd ODI)లో భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ (Shikhar Dhawan - Virat Kohli) ఓ అరుదైన రికార్డు నెలకొల్పారు. భారత్ తరఫున ఎడమ కుడి కాంబినేషన్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మూడో జోడిగా కోహ్లీ - ధావన్ నిలిచారు. మూడో వన్డేలో ఈ ఇద్దరు ఢిల్లీ బ్యాటర్లు కీలక భాగస్వామ్యం నెలకొల్పిన విషయం తెలిసిందే. కోహ్లీ - ధావన్ జోడి ఇప్పటివరకు 28 సార్లు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
భారత్ తరఫున ఎడమ కుడి కాంబినేషన్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జాబితాలో భారత దిగ్గజాలు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండూల్కర్ (Sachin - Ganguly) ఉన్నారు. గంగూలీ- సచిన్ జోడి 55 పైగా అర్ధశతకాల భాగస్వామ్యాలు నెలకొల్పారు. తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ జోడీ (32 అర్ధ సెంచరీల భాగస్వామ్యం) ఉంది. నిన్నటివరకు మూడో స్థానంలో ఉన్న ఎంఎస్ ధోనీ - సురేష్ రైనా (Dhoni - Raina 27 అర్ధ సెంచరీల భాగస్వామ్యం) నాలుగో స్థానంకు పడిపోయారు. కోహ్లీ - ధావన్ జోడి మూడో స్థానంకు చేరుకున్నారు.
Also Read: Virat Kohli - Vamika: సూపర్ స్పోర్ట్స్.. ఇది పద్దతికాదు! కోహ్లీ-అనుష్క కోరినా కూడా అలానేనా చేసేది!!
కేప్‌టౌన్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మూడో వన్డేలో టీమిండియా (India)పై దక్షిణాఫ్రికా (South Africa) నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 287 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (65), శిఖర్ ధావన్ (61), దీపక్ చహర్ (54) అర్ధ శతకాలు చేసినా రాహుల్ సేనకు ఓటమి తప్పలేదు. మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. టెస్టు సిరీస్‌నూ 2-1 తేడాతో ప్రొటీస్ జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook