CPI 2021: అనివీతి సూచీలో 16 స్థానాలు దిగజారిన పాక్..భారత్ ర్యాంక్ ఎంతంటే..

CPI 2021: ప్రపంచ అవినీతి సూచికలో పాకిస్తాన్‌ మరింత దిగజారి 140వ స్థానానికి పడిపోయింది. ఇండియా 85వ స్థానంలో నిలిచింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 11:04 AM IST
  • ప్రపంచ అవినీతి సూచీ 2021 విడుదల
  • తొలి స్థానంలో డెన్మార్క్
  • చివరి స్థానంలో దక్షిణ సూడాన్
CPI 2021: అనివీతి సూచీలో 16 స్థానాలు దిగజారిన పాక్..భారత్ ర్యాంక్ ఎంతంటే..

Pakistan slips further on Corruption Perceptions Index: ప్రపంచ అవినీతి సూచీలో (Global Corruption Perceptions Index 2021) పాకిస్తాన్‌ ర్యాంక్ దిగజారింది. 180 దేశాల జాబితాలో 140వ స్థానానికి పడిపోయింది.  బెర్లిన్‌కు చెందిన ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ (Transparency International) ఈ లిస్ట్ ను విడుదల చేస్తుంది. గత పదేళ్లలో ప్రపంచ దేశాల్లో 86 శాతం దేశాలు అవినీతి నిర్మూలనలో పెద్దగా పనితీరు కనబరచలేదని సంస్థ పేర్కొంది. 2021 సీపీఐ (కరప్షన్‌ పర్సెప్షన్‌ ఇండెక్స్‌) జాబితాలో 180 దేశాలకు 0– 100 (అత్యధిక అవినీతి– శూన్య అవినీతి) రేంజ్‌లో మార్కులు ఇచ్చారు. ఈ జాబితాలో 28 సీపీఐతో పాక్‌ 140వ స్థానంలో నిలిచింది. 2020లో 31 సీపీఐతో పాక్ 124వ స్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో 88 స్కోరుతో డెన్మార్క్ (Denmark), ఫిన్లాండ్, న్యూజిలాండ్‌లు అవినీతి తక్కువగా ఉన్న దేశాలుగా నిలిచాయి. వీటి తర్వాత స్థానాల్లో నార్వే, సింగపూర్, స్వీడన్‌ నిలిచాయి. భారత్‌ (India) 40 సీపీఐతో 85వ స్థానంలో, బంగ్లాదేశ్‌ 147వ స్థానంలో నిలిచాయి. పాక్‌లో (Pakistan) రూల్‌ ఆఫ్‌ లా లేకపోవడమే అవినీతి పెరగడానికి కారణమని సంస్థ విశ్లేషిం చింది.  భారీ అవినీతిమయ దేశాల్లో దక్షిణ సూడాన్ (South Sudan), సిరియా, సోమాలియా, వెనుజులా, అఫ్గాన్‌ ఉన్నాయి. ప్రపంచ దేశాల సరాసరి సీపీఐ స్కోరు 43 వద్ద ఉందని సంస్థ తెలిపింది. ప్రపంచదేశాల్లో మూడింట రెండొంతుల దేశాలు ఇప్పటికీ 50 స్కోరు దిగువనే ఉన్నాయని సంస్థ వెల్లడించింది. 

Also Read: US President Joe Biden: రిపోర్టర్ ను అసభ్య పదజాలంతో దూషించిన బైడెన్, వీడియో వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News