Yuzvendra Chahal trolls Shardul Thakur over IPL 2022 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీలలో వేలం నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఏర్పాట్లు చేస్తోంది. మెగా వేలం నేపథ్యంలో ఇప్పటికే 8 ఫ్రాంఛైజీలు రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించగా.. కొత్త ఫ్రాంఛైజీలు లక్నో, అహ్మదాబాద్ కూడా ముగ్గురు ఆటగాళ్ల పేర్లను వెల్లడించాయి. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కేఎల్ రాహుల్ (KL Rahul) సారథి కాగా.. అహ్మదాబాద్ టీంకు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2022 మెగా వేలం (IPL 2022 Auction) జరగనున్న నేపథ్యంలో ఫ్రాంఛైజీల యాజమాన్యాలతో పాటు అభిమానులలో కూడా ఆసక్తి నెలకొంది. ఏ ఆటగాడు ఏ జట్టుకు ఎంపికవుతాడు, ఎంత ధర పలుకుతాడనే విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. అయితే ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటన పూర్తిచేసుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur ), మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzvendra Chahal), ఓపెనర్ కేఎల్ రాహుల్ మధ్య జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Success Mantra: ఇలా చేస్తే మీ ఇంట్లో ధనంతో పాటు ఏ లోటు లేకుండా ఉంటుంది!!
హోటల్‌లో కూర్చున్న శార్దూల్ ఠాకూర్.. 'ఈసారి వేలంలో నాకోసం మీ బడ్జెట్ ఎంత?' అని కేఎల్ రాహుల్‌ను అడిగాడు. 'నీకైతే బేస్ ప్రైజ్' అని లక్నో సారథి రాహుల్ సమాధానమిచ్చాడు. ఈ విషయం మధ్యలో కలగజేసుకున్న అల్లరిపిలాడు యజువేంద్ర చహల్.. 'వేలంలో దేవుడికి వెల కట్టలేం బ్రో' అని అన్నాడు. శార్దూల్‌ను 'లార్డ్ శార్దూల్' (Lord Shardul) అని పిలుస్తారని భారత అభిమానులకు అందరికీ తెలిసిందే. దక్షిణాఫ్రికాలోని ఓ హోటల్‌లో ఈ సరదా సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన శార్దూల్ ఠాకూర్ జట్టును విజేతగా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. కీలక సమయంలో బ్యాటయింగ్ , బౌలింగ్‌లో మెరిశాడు. ముఖ్యంగా ఫైనల్లో కీలక వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. అయితే రిటెన్షన్ నిబంధనల కారణంగా చెన్నై అతడిని రిటైన్ చేసుకోలేకపోయింది. దీంతో శార్దూల్ వేలంలోకి రానున్నాడు. అతడికి భారీ ధర పలికే అవకాశం ఉంది. చెన్నై అతడిని దక్కించుకునేందుకు చూస్తుందట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook