Rohit - Sammy: ధోనీ లాగే అతడు మంచి కెప్టెన్.. టీమిండియా సురక్షితమైన సారథి చేతుల్లోనే ఉంది: సామీ

టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మపై వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్ డారెన్‌ సామీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎంఎస్ ధోనీ లానే రోహిత్ కూడా అద్భుతమైన కెప్టెన్ అని పేర్కొన్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2022, 01:49 PM IST
  • రోహిత్ శర్మపై డారెన్‌ సామీ ప్రశంసల వర్షం
  • ధోనీ లాగే అతడు మంచి కెప్టెన్
  • టీమిండియా సురక్షితమైన సారథి చేతుల్లోనే ఉంది
Rohit - Sammy: ధోనీ లాగే అతడు మంచి కెప్టెన్.. టీమిండియా సురక్షితమైన సారథి చేతుల్లోనే ఉంది: సామీ

Darren Sammy says Rohit Sharma is excellent captain: టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ (Rohit Sharma)పై వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్ డారెన్‌ సామీ (Darren Sammy) ప్రశంసల వర్షం కురిపించాడు. ఎంఎస్ ధోనీ, గౌతమ్ గంభీర్ లానే రోహిత్ కూడా అద్భుతమైన కెప్టెన్ అని పేర్కొన్నాడు. రోహిత్‌ చేతుల్లో భారత జట్టు సురక్షితంగా ఉందని అభిప్రాయపడ్డాడు. విరాట్‌ కోహ్లీ (Virat kohli) కెప్టెన్సీ వివాదం టీమిండియాపై ఎలాంటి ప్రభావం చూపదని సామీ అన్నాడు. డారెన్‌ సామీ నేతృత్వంలో విండీస్ రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన విషయం తెలిసిందే. 

టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం టీ20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు. దాంతో రోహిత్ శర్మ జట్టు పగ్గాలు అందుకున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు 2021 డిసెంబరులో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ.. హిట్‌మ్యాన్‌కే బాధ్యతలు అప్పగించింది. ఇక 2022 జనవరిలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ఓటమి అనంతరం కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌ కెప్టెన్సీకీ కూడా గుడ్‌ బై చెప్పాడు. దాంతో కోహ్లీ ఇప్పుడు కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతున్నాడు. 

Also Read: King Cobra: హ్యాట్సాఫ్ భయ్యో.. కరవడానికి మీదికొస్తున్న భారీ కింగ్ కోబ్రాను ఒట్టి చేతులతో పట్టేశాడు (వీడియో)!!

లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో పాల్గొన్న డారెన్‌ సామీ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ కెప్టెన్సీ జట్టుపై ప్రభావం చూపుతుందని నేను భావించడం లేదు. రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్. ఐపీఎల్‌లో ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరించడం నేను చూశాను. ఎంఎస్ ధోనీ, గౌతమ్ గంభీర్ వంటి మంచి కెప్టెన్లలో అతనూ ఒకడు. ఆటగాళ్లను ప్రోత్సహించడం, వారి నుంచి అత్యుత్తమమైన ప్రదర్శన రాబట్టడం రోహిత్‌కు బాగా తెలుసు' అని అన్నాడు. 

'ఎంఎస్ ధోనీ (MS Dhoni), గౌతమ్ గంభీర్‌ లాంటి ఆటగాళ్లలా రోహిత్ శర్మ ఐపీఎల్‌ (IPL)లో తన జట్టును విజయ పథంలో నడిపించాడు. వీళ్లంతా తమ ఆటగాళ్ల నుంచి సరైన ప్రదర్శన రాబట్టగలరు. ముగ్గురు సహజంగానే విజయాలు సాధించి ట్రోఫీలు సాధించి పెట్టారు. నేనైతే ఇప్పుడు భారత జట్టు గురించి ఆందోళన చెందడం లేదు. టీమిండియా ఇప్పుడు సురక్షితమైన వ్యక్తి చేతుల్లోనే ఉంది. మైదానంలో విరాట్ కోహ్లీ తన ప్రదర్శనతో అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. బ్యాటర్‌గా అతడు జట్టుకు విలువైన ఆటగాడు' అని డారెన్‌ సామీ పేర్కొన్నాడు. 

Also Read: U19 World Cup 2022: టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్ ఆటగాడికి పాజిటివ్! కెప్టెన్ ఎవరంటే?!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News