U19 World Cup 2022: టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్ ఆటగాడికి పాజిటివ్! కెప్టెన్ ఎవరంటే?!!

అండర్ 19 ప్రపంచకప్ 2022 ఆడుతున్న టీమిండియాకు భారీ షాక్ త‌గిలింది. స్టార్ ఆల్‌రౌండర్‌ నిశాంత్ సింధు క‌రోనా బారిన ప‌డ్డాడు.  బంగ్లాదేశ్‌తో జరగనున్న క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు సింధు దూరం కాగా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ అనీశ్వర్ గౌతమ్ జట్టులోకి రానున్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2022, 09:09 AM IST
  • టీమిండియాలో కరోనా కలకలం
  • నిశాంత్ సింధుకు క‌రోనా
  • జట్టులోకి లెఫ్టార్మ్ స్పిన్నర్ అనీశ్వర్ గౌతమ్
U19 World Cup 2022: టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్ ఆటగాడికి పాజిటివ్! కెప్టెన్ ఎవరంటే?!!

Nishant Sindhu tests positive for Covid 19: అండర్ 19 ప్రపంచకప్ (Under 19 World Cup) 2022 ఆడుతున్న టీమిండియా (Team India)కు భారీ షాక్ త‌గిలింది. స్టార్ ఆల్‌రౌండర్‌ నిశాంత్ సింధు (Nishant Sindhu) క‌రోనా వైరస్ మహమ్మారి బారిన ప‌డ్డాడు. మెగా టోర్నీ రూల్స్ ప్రకారం శుక్ర‌వారం భారత ఆట‌గాళ్లంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. సింధుకు పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దాంతో శనివారం బంగ్లాదేశ్‌ (IND vs BAN)తో జరగనున్న క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు ముందు భారత యువ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. 

లీగ్ ఆరంభంలోనే రెగ్యూల‌ర్ కెప్టెన్ యష్ ధుల్ (Yash Dhull) దూరం కావ‌డంతో నిశాంత్ సింధు యువ భార‌త జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించిన విషయం తెలిసిందే. సారథిగా మాత్రమే కాకుండా తన ఆటతో సింధు జ‌ట్టు విజ‌యాల్లో కూడా కీల‌క పాత్ర పోషించాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు అతడు దూరం కాగా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ అనీశ్వర్ గౌతమ్ (Aneeshwar Gautam) జట్టులోకి రానున్నాడు. అయితే గౌతమ్ తుది జట్టులో ఉంటాడా? లేదా? అన్న విషయం తెలియరాలేదు.

Also Read: Shyam Singha Roy: రోజీ సింగరాయ్ కోసం.. ఆన్‌లైన్‌ క్లాస్‌లోకి వచ్చిన శ్యామ్‌ సింగరాయ్‌! షాక్‌లో హీరో నాని!!

ఇంత‌కుముందు క‌రోనా బారిన ఆరుగురు భార‌త యువ ఆట‌గాళ్లు పూర్తిగా కోలుకున్నారని ఐసీసీ వర్గాలు తెలిపాయి. క‌రోనా నుంచి కోలుకున్న కెప్టెన్ యష్ ధుల్‌, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌తో పాటు సిద్ధార్థ్ యాదవ్, ఆరాధ్య యాదవ్ మరియు మానవ్ పరాఖ్ ప్రాక్టీస్ తాజాగా సెష‌న్‌లో పాల్గొన్నారు. ఈ రోజు బంగ్లాదేశ్‌తో జరగనున్న క్వార్ట‌ర్‌ ఫైన‌ల్ మ్యాచుకు వీరందరూ అందుబాటులో ఉంటారు. యష్ ధుల్‌ జట్టును నడిపించనున్నాడు. 

ట్రినిడాడ్‌లో ఏడు రోజుల క్వారంటైన్ తర్వాత యష్ ధల్ శుక్రవారం ఉదయం ఆంటిగ్వా చేరుకున్నాడు. షేక్ రషీద్‌, సిద్ధార్థ్ యాదవ్, ఆరాధ్య యాదవ్, మానవ్ పరాఖ్ కూడా ఆంటిగ్వా చేరుకొని ప్రాక్టీస్ ఆరంభించారు. ఈరోజు క్వార్ట‌ర్‌ ఫైన‌ల్ మ్యాచులో ఆడేందుకు వారికి తగిన మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. ఏదేమైనా స్టార్ ప్లేయర్స్ కీలక మ్యాచుకు అందుబాటులో ఉండడం కలిసొచ్చే అంశం. 

Also Read: Horoscope Today January 29 2022: నేటి రాశి ఫ లాలు.. ఆ రాశి వారికి ధన, ధాన్య లాభాలు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News