Carrot Side Effects: క్యారెట్ ఆరోగ్యానికి మంచిదే.. కానీ, వీళ్లు క్యారెట్ కు దూరంగా ఉండాలి!

Carrot Side Effects: క్యారెట్ తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కానీ, అదే క్యారెట్ కొంతమందికి దుష్ప్రభావాలు చూపుతుంది. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు క్యారెట్ తినకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి వారు క్యారెట్ తినకూడదో చూద్దాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 04:54 PM IST
    • క్యారెట్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు
    • వాటితో పాటు దుష్ప్రభావాలు చూపొచ్చు
    • కొన్ని అనారోగ్య సమస్యల వాళ్లు తినకపోవడమే మంచిది
Carrot Side Effects: క్యారెట్ ఆరోగ్యానికి మంచిదే.. కానీ, వీళ్లు క్యారెట్ కు దూరంగా ఉండాలి!

Carrot Side Effects: కూరగాయల్లో క్యారెట్ వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ, తరచూ క్యారెట్లు తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీకు తెలుసా? కొన్ని రకాల అనారోగ్యాలతో బాధపడేవారు క్యారెట్లు తినకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారు క్యారెట్లు తినడం వల్ల ప్రయోజనం కంటే హానీ ఎక్కువ జరుగుతుందని అంటున్నారు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వారు క్యారెట్లు తినకూడదో తెలుసుకుందాం. 

క్యారెట్ తింటే అలెర్జీ..

క్యారెట్ తిన్న తర్వాత కొంతమంది అలెర్జీల బారిన పడుతున్నారు. నిజానికి, క్యారెట్ తినడం వల్ల కొందరిలో దుష్ప్రభావాలు.. ఏర్పడే అవకాశం ఉంది. చర్మ సమస్యలతో పాటు అతిసారం బారిన పడవచ్చు. 

క్యారెట్ తిన్న వెంటనే పసుపు రంగులో మారుతుంది..

క్యారెట్‌లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత విటమిన్ ఎగా మారుతుంది. క్యారెట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ రక్తంలో కెరోటిన్ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది కెరోటినిమియాకు కారణమవుతుంది. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత చర్మం పసుపు రంగులోకి మారుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యారెట్ తినకూడదు..

క్యారెట్‌లో సహజ చక్కెరలు (నేచురల్ షుగర్స్) ఎక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యారెట్లను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది. క్యారెట్‌లోని చక్కెర గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది శరీరంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది.

పాలిచ్చే మహిళలు కూడా..

పాలిచ్చే మహిళలు, గర్భిణిలు క్యారెట్లు తినడం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే  ఏది తిన్నా అది మీ బిడ్డకు చేరుతుంది. క్యారెట్లు తల్లి పాల రుచిని మారుస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి పాలిచ్చే తల్లులు పెద్ద మొత్తంలో క్యారెట్ జ్యూస్ తాగకుండా ఉండాలి.

చిన్న పిల్లలకు..

కొన్ని నివేదికల ప్రకారం.. చిన్న పిల్లలకు క్యారెట్లు సురక్షితం కాదు. అందువల్ల, క్యారెట్లు చిన్న పిల్లలకు చాలా అరుదుగా ఇవ్వాలి. కాబట్టి.. చిన్న పిల్లలకు క్యారెట్లు తక్కువ మోతాదులో ఇవ్వాలి.  

Also Read: Tea and Coffee with Empty Stomache: ఉదయం పరగడుపున టీ, కాఫీలతో కలిగే దుష్పరిణామాలు

Also Read: Chapped Lips Remedies: చలికాలంలో పగిలిన పెదాలు మృదువుగా మారాలంటే ఇలా చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News