Chalo Vijayawada: విజయవాడలో హైటెన్షన్.. అటు పోలీసుల అరెస్టులు, ఇటు ఉద్యోగుల దూకుడు..

Chalo Vijayawada: ఏపీలో 'ఛలో విజయవాడ' హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. పీఆర్సీ రద్దుకు డిమాండ్ చేస్తూ తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 07:49 AM IST
  • ఇవాళ ఉద్యోగుల ఛలో విజయవాడ నిరసన కార్యక్రమం
  • అనుమతి లేదంటున్న పోలీసులు.. దూకుడుగా ఉద్యోగులు
  • ఎక్కడికక్కడ నిర్బంధాలు.. ముందస్తు నోటీసులు
Chalo Vijayawada: విజయవాడలో హైటెన్షన్.. అటు పోలీసుల అరెస్టులు, ఇటు ఉద్యోగుల దూకుడు..

Chalo Vijayawada Protest: గత నెలలో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితి నేడు 'ఛలో విజయవాడ'కు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి ఉద్యోగులంతా విజయవాడకు తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఉద్యోగుల ఛలో విజయవాడ నిరసనను భగ్నం చేసేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉద్యోగ సంఘాల నేతలకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. విజయవాడ వైపు వెళ్లే మార్గాలపై ప్రత్యేక నిఘా ఉంచి రైళ్లు, బస్సులు, ఇతరత్రా వాహనాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. అత్యవసర వైద్యం కోసం వెళ్లేవారికి తప్ప ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గురువారం ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవు ఇవ్వొద్దని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

పలువురు ఉద్యోగ సంఘాల ముఖ్య నేతలు 'ఛలో విజయవాడ'కు వెళ్లకుండా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు నారాయణ రెడ్డి, యూటీఎఫ్ కార్యదర్శి విజయగౌరి తదితర ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మరికొందరు నేతలకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. 'ఛలో విజయవాడ' కార్యక్రమానికి అనుమతి లేదని.. అయినప్పటికీ అందులో పాల్గొంటే చర్యలు తప్పవని ప్రభుత్వం వారిని హెచ్చరించింది. 

పలు జిల్లాల్లో ఉపాధ్యాయులు స్కూళ్ల నుంచి బయటకు అడుగుపెట్టకుండా పోలీసులను కాపలా పెట్టింది.  పోలీసులు, ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులు మారు వేషాల్లో విజయవాడకు (Chalo Vijayawada) తరలి వెళ్తుండటం గమనార్హం. కొంతమంది ఉద్యోగులు పోలీసులు గుర్తుపట్టకుండా బుర్ఖాల్లో విజయవాడకు (Andhra Pradesh) బయలుదేరారు. ఓవైపు పోలీస్ నిర్బంధాలు.. మరోవైపు ఉద్యోగుల దూకుడుతో... ఇవాళ్టి 'ఛలో విజయవాడ' కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. 

Also Read: Horoscope Today Feb 3 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి రియల్ ఎస్టేట్‌లో లాభాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News