Horoscope Today Feb 3 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి రియల్ ఎస్టేట్‌లో మంచి లాభాలు..

Horoscope Today  Feb 3 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో మరికొన్ని రాశుల వారికి ఆస్తి సంబంధిత వివాదాలు అపరిష్కృతంగానే ఉండే అవకాశం ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 06:36 AM IST
 Horoscope Today Feb 3 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి రియల్ ఎస్టేట్‌లో మంచి లాభాలు..

Horoscope Today Feb 3 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... దాదాపుగా అన్ని రాశుల్లోని విద్యార్థులకు ఇవాళ అనువైన సమయం. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారు అకడమిక్ పరంగా తమదైన ముద్ర వేయగలుగుతారు. కొంతమంది రియల్ ఎస్టేట్‌లో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది.

మేషం - Aries : వినోదానికి ఎక్కువ సమయం వెచ్చించడం మానేయండి. ఆస్తి సంబంధిత పెట్టుబడుల్లో లాభాలు చవిచూస్తారు. ఎగుమతులు-దిగుమతుల బిజినెస్‌లో ఉన్నవారికి బాగా కలిసొస్తుంది. ఆస్తి వివాదాలకు సంబంధించి చట్టపరమైన పోరాటాల్లో విజయం దక్కుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. లక్కీ కలర్: Pearl, లక్కీ నంబర్: 3

వృషభం - Taurus : ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీరు చాలా కాలంగా అమ్మాలనుకుంటున్న పాత ఇంటిని కొనేందుకు ఒకరు ముందుకొస్తారు. విద్యారంగంలో ఉన్నవారికి పూర్తి అనుకూల సమయం. కొన్ని విషయాలు నిరాశ కలిగించినా ఆశావహ దృక్పథంతో ముందుకెళ్లండి. లక్కీ కలర్ : రెడ్, లక్కీ నంబర్ : 2

మిథునం - Gemini : ఇంటి సంబంధిత వివాదాలు అపరిష్కృతంగానే ఉండిపోతాయి. సమసిపోయిందనుకున్న పాత వివాదమొకటి మళ్లీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ భాగస్వామి నుంచి పూర్తి సహాయ, సహకారాలు పొందుతారు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించే అవకాశం. లక్కీ కలర్ : Mauve, లక్కీ నంబర్ : 5

కర్కాటకం - Cancer: రెగ్యులర్ వర్క్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని స్నేహితులతో గడిపితే కాస్త మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆస్తుల కొనుగోలుకు ఇది అనువైన సమయం. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎదుటివారి విషయాల్లో తొందరపాటు స్పందన సరికాదు. లక్కీ కలర్ : లెమన్, లక్కీ నంబర్ : 4

సింహం - Leo: వ్యక్తిగత రుణాలు త్వరగా మంజూరయ్యే అవకాశం. ఆస్తి సంబంధిత వివాదాలు త్వరగా పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అభినందించే సందర్భం ఒకటి వస్తుంది. లక్కీ కలర్ : పీచ్, లక్కీ నంబర్ : 1

కన్య - Virgo : అత్యుత్సాహం పనికిరాదు. బాగా కష్టపడటం కంటే స్మార్ట్‌గా పనిచేయడంపై ఫోకస్ చేయండి. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక మార్గం దోహదపడుతుంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు లభిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. లక్కీ కలర్ : వైట్, లక్కీ నంబర్: 6

తుల - Libra: కుటుంబ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మీరు చేసే పనులకు తగిన గుర్తింపు దక్కుతుంది. కొలిగ్స్‌తో వివాదాలకు దూరంగా ఉండండి. కొత్త పెట్టుబడులకు అనువైన సమయం. మీ ప్రియమైన వ్యక్తుల ఆరోగ్యం క్షీణించడం మిమ్మల్ని బాధిస్తుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారు అకడమిక్ పరంగా తమదైన ముద్ర వేయగలుగుతారు. లక్కీ కలర్ : బ్లూ, లక్కీ నంబర్ : 8

వృశ్చికం - Scorpio: స్థిరాస్తి పెట్టుబడులపై గణనీయమైన లాభాలు పొందుతారు. సేవా సంబంధిత కార్యక్రమాల ద్వారా మీ కుటుంబానికి మరింత పలుకుబడి, గౌరవం కలుగుతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి తగిన గుర్తింపు దక్కుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లక్కీ కలర్ :  సిల్వర్, లక్కీ నంబర్ : 9

ధనుస్సు- Sagittarius: సమయాన్ని సరిగా వినియోగించుకుంటే సకాలంలో పనులు పూర్తవుతాయి. మీ కుటుంబం నుంచి అన్ని విషయాల్లో సహాయ, సహకారాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టాలనుకునేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సలహాలు పాటించాలి. లక్కీ కలర్ :బ్లూ, లక్కీ నంబర్: 3

మకరం - Capricorn: మీ ఎమోషన్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. మిమ్మల్ని మీరు నమ్మాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మిమ్మల్ని డామినేట్ చేసే మహిళను జాగ్రత్తగా డీల్ చేయాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిధానంగా డ్రైవ్ చేయడమే మంచిది. బిజినెస్ సంబంధిత ట్రిప్స్‌ను చాలా ఎంజాయ్ చేస్తారు. కెరీర్‌లో పూర్తి అనుకూల సమయం. లక్కీ కలర్ : గ్రే, లక్కీ నంబర్ : 7

కుంభం - Aquarius: మూడ్ స్వింగ్స్ మిమ్మల్ని ఒంటరి అనే భావనలోకి నెట్టుతాయి. వీలైనంత వరకు కుటుంబంతో, స్నేహితులతో గడిపేందుకు ప్రయత్నించండి. రియల్ ఎస్టేట్‌లో మీ పెట్టుబడులకు మంచి లాభాలు పొందుతారు. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం. లక్కీ కలర్: ఐవరీ, లక్కీ నంబర్: 2

మీనం - Pisces : ప్రాపర్టీ వివాదాల పరిష్కారానికి మరింత ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు సరైన గైడెన్స్‌తో ముందుకు సాగాలి. కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకునేలా ప్రయత్నం సాగించాలి. మీరు ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్న వ్యక్తులకు మీ సలహాలు పనిచేయవచ్చు లేదా పనిచేయకపోవచ్చు. లక్కీ కలర్ : ఇండిగో, లక్కీ నంబర్: 5

Also Read: Covid 19 Vaccine: కరోనా వ్యాక్సిన్ వల్లే కూతురు చనిపోయిందంటూ.. హైకోర్టు పిటిషన్! ఎన్ని కోట్లు డిమాండ్ చేశాడంటే?

Also Read: Varun Tej Lavanya Tripathi Marriage: వరుణ్‌తో పెళ్లి.. లావణ్య త్రిపాఠి ఏమన్నారంటే?!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News