JioBook Laptop Features: త్వరలోనే మార్కెట్లోకి JioBook ల్యాప్ టాప్స్.. వాటి ఫీచర్లు ఏంటో తెలుసా?

JioBook Laptop Features: ప్రముఖ టెలికాం సంస్థ తమ కస్టమర్ల కోసం మరో ప్రొడక్ట్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవలే 4G స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చిన ఈ సంస్థ.. ఇప్పుడు 5G స్మార్ట్ ఫోన్ ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. దీంతో పాటు JioBook పేరిట ఓ ల్యాప్ టాప్ ను మార్కెట్లోకి తీసుకురానుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ల్యాప్ టాప్ కు సంబంధించిన వివరాలేమిటో తెలుసుకుందామా?  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2022, 01:07 PM IST
    • మార్కెట్లోకి త్వరలోనే అందుబాటులోకి జియా ల్యాప్ టాప్
    • ఇప్పటికే హార్డ్ వేర్ పరంగా అనుమతి పొందిన జియో సంస్థ
    • ఓ ల్యాప్ టాప్ కంపెనీ భాగస్వామ్యంతో JioBook తయారీ
JioBook Laptop Features: త్వరలోనే మార్కెట్లోకి JioBook ల్యాప్ టాప్స్.. వాటి ఫీచర్లు ఏంటో తెలుసా?

JioBook Laptop Features: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో.. ఎలక్ట్రానికి ఉత్పత్తులను కస్టమర్లకు అందిచడంలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే జియో ఫోన్, 4G స్మార్ట్ ఫోన్స్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు 5G స్మార్ట్ ఫోన్ ను తయారు చేసే పనిలో ఉంది. 

ఇటీవలే కొన్ని వార్తా నివేదికల ప్రకారం.. రిలయన్స్ జియో తమ స్వంత ల్యాప్ టాప్ పేరిట జియో బుక్ (Jio Book) ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ల్యాప్ టాప్ ను తక్కువ ధరకు విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ ల్యాప్ టాప్ కు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

Jio Book ల్యాప్ టాప్ లాంఛింగ్?

టెలికాం సంస్థ జియో ఇప్పుడు తమ స్వంత ల్యాప్ టాప్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. JioBook పేరుతో ల్యాప్ టాప్ కు హార్డ్ వేర్ ఆమోదపత్రం ఇటీవలే లభించింది. అయితే ఈ ల్యాప్ టాప్ ను Emdoor Digital Technology Co Ltd అనే సంస్థ తయారు చేస్తోంది. ఆ కంపెనీతో జియో చేతులు కలిపి తమ బ్రాండ్ తో మార్కెట్లోకి లాంఛ్ చేయనున్నారు. 

JioBook హార్డ్ వేర్ సెటప్

జియో ల్యాప్ టాప్ విండోస్ 10 అవుట్-ఆఫ్-ది-బాక్స్ పేరుతో మార్కెట్లోకి రానుంది. దీన్ని విండోస్ 11కి కూడా అప్ గ్రేడ్ చేసుకునే సదుపాయం ఉంది. JioPhone Next లాగా, JioBook ల్యాప్‌టాప్ కూడా అతి తక్కువ ధరలో కస్టమర్లకు అందుబాటులో రానుంది. ఈ ల్యాప్‌టాప్ AMD లేదా ఇంటెల్ యొక్క x86 ప్రాసెసర్‌లతో వినియోగానికి వస్తుందని తెలిపింది. 

JioBook ల్యాప్‌టాప్ ఫీచర్లు

అయితే ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. JioBook ల్యాప్ టాప్ గురించి ఎక్కువ సమాచారం బయటకు రాలేదు. కానీ, JioBook Android 11లో పని చేయనుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ల్యాప్‌టాప్ MediaTek MT8788 ప్రాసెసర్, 2GB వరకు RAM తో అందుబాటులోకి రావొచ్చు. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.  

Also Read: RBI Interest Rates: ఆర్బీఐ చివరి త్రైమాసిక సమీక్షలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం

Also Read: Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల వివరాలివీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News