Kajal Aggarwal counter on Body shaming: మహిళలు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు వారి బాడీలో చాలా మార్పులు వస్తాయంటోంది హీరోయిన్ కాజల్. కాజల్ కొన్ని రోజుల క్రితం తన సోదరి నిషా అగర్వాల్ కుమారుడితో కలిసి ఒక యాడ్‌లో నటిచింది. ఒరియో బిస్కట్స్‌కు సంబంధించిన ఈ యూడ్‌లో కాజల్ బేబీ బంప్‌తో కనిపించింది. అయితే అందులో కాజల్ బాడీషేప్‌పై చాలా మంది నెటిజన్స్ నెగెటివ్ కామెంట్స్ చేశారు.
దీంతో కాజల్ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. బాడీ షేమింగ్ ట్రోల్స్ చేసే వారికి సీరియస్‌గానే ఆన్సర్ ఇచ్చింది ఈ భామ. తన జీవితంలో.. తన నా శరీరంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయంటూ కాజల్ ఆ పోస్ట్‌లో పేర్కొంది. వాటన్నింటినీ తాను ఎంజాయ్ చేస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ కామెంట్స్.. మీమ్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చింది. అయితే అలాంటి వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేదంది. కష్టంగా అనిపించినా కూడా దయతో ఎలా మెలగాలో నేర్చుకోండి అంటూ హితవు పలికింది.
అంతేకాదు తనలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోన్న వారికి కొన్ని సలహాలు కూడా ఇచ్చింది కాజల్. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు బరువు పెరగడంతో పాటు బాడీ ఎన్నో మార్పులకు లోనవుతుందని కాజల్ చెప్పుకొచ్చింది. బాడీ సాగడం వల్ల కొందరి బాడీపై స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతుంటాయని పేర్కొంది. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ మునుపటి మాదిరిగా మారడానికి కాస్త ఎక్కువే సమయం పట్టవచ్చని చెప్పింది. అలాగే కొన్ని యోగాసాలు, వర్క్ అవుట్స్ కూడా సూచించింది.
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 9, 2022
ఇక ఒక్కోసారి మునుపటి మాదిరిగా బాడీ మారకపోవచ్చని అని తెలిపింది. అయితే ఈ మార్పులు అన్నీ కూడా సర్వసాధారణమే అని కాజల్ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయినా మన లైఫ్‌లోకి ఒక బేబీ రాబోతుందన్న హ్యాపీనెస్ ముందు ఇలాంటివన్నీ పట్టించుకోకండి అంటూ ఆమె సూచించింది. ఇలా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా, ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేసింది.
Also Read: Rishabh Pant Opener: వెస్టిండీస్‌తో రెండో వన్డే.. రిషబ్ పంత్ ఓపెనర్‌గా రావడానికి కారణం ఇదే!!
Also Read: IND vs WI 2nd ODI: టీమిండియాదే బ్యాటింగ్.. రాహుల్ ఆయేగా! ఓపెనర్‌గా టీమిండియా కొత్త ప్రయోగం!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook