Deepak Hooda: నా చిన్ననాటి కల నెరవేరింది.. విరాట్ కోహ్లీకి థాంక్స్: దీపక్‌ హుడా

Deepak Hooda Indian ODI Cap: భారత మాజీ సారథి ఎంస్ ధోనీ లేదా విరాట్ కోహ్లీ చేతుల మీద‌గా తొలి వన్డే క్యాప్‌ను పొందాలనేది తన చిన్ననాటి కల అని దీపక్ హుడా తాజాగా వెల్ల‌డించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2022, 03:41 PM IST
  • ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హుడా
  • నా చిన్ననాటి కల నెరవేరింది
  • విరాట్ కోహ్లీకి థాంక్స్
 Deepak Hooda: నా చిన్ననాటి కల నెరవేరింది.. విరాట్ కోహ్లీకి థాంక్స్: దీపక్‌ హుడా

Deepak Hooda about Indian ODI Cap: మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో దీపక్ హుడా భారత జట్టు తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. తొలి మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అతడికి టీమిండియా క్యాప్ అందించి జట్టులోకి స్వాగతం పలికాడు. దాంతో తన చిన్ననాటి కల నెరవేరిందని దీపక్ హుడా చెప్పాడు. భారత మాజీ సారథి ఎంస్ ధోనీ లేదా విరాట్ కోహ్లీ చేతుల మీద‌గా తొలి వన్డే క్యాప్‌ను పొందాలనేది తన కల అని హుడా తాజాగా వెల్ల‌డించాడు.

తొలి వన్డే మ్యాచ్‌లో దీపక్‌ హుడా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్‌లో కీలక సమయంలో 26 పరుగులు చేసి తనేంటో నిరూపించుకున్నాడు. రెండో వన్డేలో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరోసారి విలువైన 29 పరుగులు చేశాడు. అంతేకాకుండా బౌలింగ్‌లోనూ ఓ వికెట్ వికెట్‌ పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో ప్రమాదకరంగా మారుతున్న విండీస్‌ బ్యాటర్‌ షమర్  బ్రూక్స్ (44; 64 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) వికెట్‌ తీశాడు. ఇది హుడాకు తొలి అంతర్జాతీయ వికెట్‌. 

మ్యాచ్‌ అనంతరం దీపక్‌ హుడాను సూర్యకుమార్‌ యాదవ్‌ సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. 'నేను వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భార‌త్ తరఫున అరంగేట్రం చేశాను. అది నాకు అద్భుతమైన అనుభూతి. చాలా సంతోషం వేసింది. అరంగేట్రం కోసం ఎంతో కష్టపడ్డా. ఆ మ్యాచ్‌కు ముందు సూర్యతో మాట్లాడాను. నా శ‌క్తికి మించి జ‌ట్టు కోసం ప‌ని చేస్తానని చెప్పాను. టీమిండియా తరఫున ఆడాలి అనేది ప్ర‌తీ ఒక్క ఆట‌గాడి క‌ల‌. నేను జ‌ట్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది' అని దీపక్‌ హుడా అన్నాడు. 

'నా చిన్నప్పటి నుంచి ఒకటే కల. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినప్పుడు ఎంఎస్‌ ధోనీ లేదా విరాట్ కోహ్లీ చేతుల మీదుగా క్యాప్‌ను అందుకోవాలని. ఇప్పుడు కోహ్లీ క్యాప్‌ను అందించడం మరిచిపోలేని సందర్భం. కోహ్లీకి భయ్యాకు చాలా థాంక్స్. నేను ఇతర అంశాలను పక్కన పెట్టేసి ఎంపిక కావడంపైనే దృష్టిసారించా. నా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు గౌర‌వంగా భావిస్తున్నా. ఈ అద్భుతమైన ప్రయాణంలో న‌న్ను వెనుకుండి న‌డిపించిన‌ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని సూర్యకుమార్‌తో దీపక్ హుడా పేర్కొన్నాడు. ఇందుకు సంబందించిన వీడియోను బీసీసీఐ తమ ట్విటర్‌లో పోస్టు చేసింది. 

Also Read: IND vs WI: భారత్‌లో ఇలాంటి స్పెల్ ఎప్పుడూ చూడలేదు.. అతడు అద్భుత బౌలర్: రోహిత్ శర్మ

Also Read: Saniya Iyappan: ఓపెన్ షవర్ కింద హీరోయిన్ స్నానం.. సిగ్గులేదా అంటూ నెటిజన్ కామెంట్ (వీడియో)!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News