Malaika Arora Trolls: అయ్యోరామ.. మలైకా అరోరా ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా!!

Malaika Arora wearing a short shirt dress: తాజాగా మలైకా అరోరా ముంబైలోని ఖర్ ప్రాంతానికి వచ్చారు. బ్రౌన్ ఫుల్ ఓవర్‌తో కూడిన పొట్టి చొక్కా మాత్రమే వేసుకుని రోడ్డుపై ఆగి ఉన్న తన కారు దగరికి నడుచుకుంటూ వచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2022, 04:58 PM IST
  • ముంబై వీధుల్లో మలైకా అరోరా చక్కర్లు
  • చొక్కా మాత్రమే వేసుకున్న మలైకా
  • మలైకా ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా
Malaika Arora Trolls: అయ్యోరామ.. మలైకా అరోరా ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా!!

Malaika Arora wearing a short shirt dress: బాలీవుడ్ హాట్ బ్యూటీ 'మలైకా అరోరా' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 48 ఏళ్ల వయస్సులోనూ యువ హీరోయిన్లకు ధీటుగా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఆమెను చూసి ఈర్ష పడని యువ హీరోయిన్‌లు ఉండరంటే అతిశయోక్తి లేదు. ఇక మలైకా ఫిగర్‌కి ఫిదా కానీ అభిమాని ఉండడు. 13 ఏళ్ల కొడుకు ఉన్నా.. మలైకాలో అందం మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. ఈ వయసులోనూ అడపాదడపా ఐటమ్ సాంగ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

మలైకా అరోరా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలు, యోగా, కసరత్తులకు సంబందించిన ఫొటోలు, వీడియోలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో పోస్ట్ చేసి అభిమానులకు నిత్యం టచ్‌లోనే ఉంటారు. ఇక తన పెంపుడు కుక్క కాస్పర్‌ని వాకింగ్ కోసం బయటికి తీసుకొచ్చినప్పుడు, జిమ్‌కు వెళ్లే సమయంలో మలైకా నిత్యం వార్తల్లో నిలిస్తుంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హాట్ బ్యూటీ మరోసారి సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అయ్యారు.

తాజాగా మలైకా అరోరా ముంబైలోని ఖర్ ప్రాంతానికి వచ్చారు. బ్రౌన్ ఫుల్ ఓవర్‌తో కూడిన పొట్టి చొక్కా మాత్రమే వేసుకుని రోడ్డుపై ఆగి ఉన్న తన కారు దగరికి నడుచుకుంటూ వచ్చారు. అక్కడ ఫొటోలకు పోజులిచ్చి కారు ఎక్కి వెళ్లిపోయాయిరు. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు మలైకా అందాలను ఆస్వాదిస్తుంటే.. మరొకొందరు మాత్రం ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. 'మలైకా.. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా?', 'అయ్యోరామ.. ఇదేం ఫ్యాషన్' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మలైకా డ్రెసింగ్ స్టైల్‌పై ట్రోల్స్ రావడం ఇదేమి మొదటిసారి కాదు.   

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bollywood (@bollywood.mobi)

బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్‌తో మలైకా అరోరా పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గత 3-4 సంవత్సరాల పాటు వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. బాలీవుడ్ లవ్‏బర్డ్స్ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇటీవల వీరిద్దర విడిపోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. తమపై బంధంపై వస్తున్న రూమర్లపై ఇటీవల ఇద్దరు స్పందించి అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. దాంతో ఆ రూమర్లకు చెక్ పడింది. ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా మలైకా సుపరిచితురాలే. అతిథి, గబ్బర్ సింగ్‌ సినిమాల్లో ఆమె ఐటమ్ సాంగ్స్ చేశారు. 

Also Read: Punjab Kings Captain: శిఖర్ ధావన్‌కు నిరాశే.. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ అతడే! త్వరలోనే అధికారిక ప్రకటన!!

Also Read: Turmeric Remedies: పసుపుతో ఇలా చేస్తే మీ సమస్యలన్నీ తొలగి.. డబ్బు కొరత తీరుతుంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News