Cat bite : షాకింగ్ న్యూస్.. పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి!

Cat bite: పిల్లి కాటుకు గురై ఇద్దరు మహిళల మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2022, 09:06 AM IST
  • కృష్ణా జిల్లాలో విషాదం
  • రేబిస్‌ బారినపడి రెండు నెలల తర్వాత ఇద్దరు మహిళలు మృతి
  • అదే పిల్లి కుక్కకాటుకు బలి
Cat bite : షాకింగ్ న్యూస్.. పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి!

2 Women Killed by Cat bite: సాధారణంగా పాము కాటుకు, కొన్నిసార్లు కుక్కకాటుకు గురై చనిపోవడం చూసుంటాం. కానీ పిల్లి కరిచి చనిపోవడం మాత్రం చాలా అరుదుగా జరుగుతోంది. అలాంటి ఓ ఘటన కృష్ణా జిల్లాలో (Krishna District) చోటుచేసుకుంది. పిల్లికాటుకు (Cat bite) గురై ఇద్దరు మహిళలు ఒకే రోజు మృత్యువాతపడ్డారు. ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే..ఇద్దరి మహిళల్ని బలితీసుకున్న ఆ పిల్లి..కుక్కకాటుకు బలైంది. 

అసలేం జరిగిందంటే...
కృష్ణా జిల్లా మొవ్వ (movva) మండలం వేములమడ దళితవాడ కాలనీకి చెందిన రిటైర్డ్‌ ఆర్టీసీ కండక్టర్‌ సాలి భాగ్యారావు భార్య కమల (64), అదే కాలనీలో ఉంటున్న ఆర్‌ఎంపీ వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణి (43)లను రెండు నెలల కిందట ఓ పిల్లి కరిచింది. అప్పట్లో ఆ మహిళలిద్దరూ వైద్యుల సలహా మేరకు టీటీ ఇంజెక్షన్‌ చేయించుకుని మందులు వాడారు. కొద్దిరోజులకు ఉపశమనం కలగడంతో యథావిధిగా తమ పనులు చేసుకోసాగారు. 

అయితే నాలుగు రోజుల క్రితం మళ్లీ ఇద్దరికి అనారోగ్యం తిరగబెట్టింది. కమలను మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చేర్పించగా.. నాగమణి శుక్రవారం విజయవాడలోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. నాగమణి శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. కమల కూడా శనివారం ఉదయం10 గంటలకు చనిపోయింది. వారిద్దరికీ పిల్లి కరవడంతో ఇద్దరికీ ర్యాబిస్‌ సోకిందని వైద్యులు చెప్పినట్లు స్థానికులు వెల్లడించారు. ఆ ఇద్దరు మహిళలను కరిచిన పిల్లి కుక్కకాటుకు బలైంది. ఇక్కడ మరో షాకింగ్ విషయమేంటంటే...పిల్లిని కరిచిన కుక్క కూడా కొద్దిరోజులకే మృతి చెందినట్లు తెలుస్తోంది. 

Also Read: Murder for Chicken Curry: చికెన్ కర్రీ వండలేదని.. చెల్లెలిని దారుణంగా హత్య చేసిన అన్న..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News