Pepaid Recharge Plans: దేశంలో టెలికాం జియో, ఎయిర్టెల్, వి (వొడాఫోన్ ఐడియా) వంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా సేవలు అందిస్తోంది. ఈ సంస్థలన్నీ ప్రీ పెయిడ్ వినియోగదారులకు వివిధ ధరల రేంజ్లో రీఛార్జ్ ఫ్లాన్స్ అందిస్తున్నాయి.
బడ్జెట్ ధరలో ఏ టెలికాం నెట్వర్క్ బెస్ట్ ఆఫర్స్ ఇస్తోంది? రూ.200కన్నా తక్కువ ధరలో బెస్ట్ ఆఫర్స్ ప్లాన్స్ ఇస్తున్న టెలికాం నెట్వర్క్ ఏది? అనే వివరాలు ఇలా ఉన్నాయి.
టెలికాం నెట్‌వర్క్‌ల వారీగా ప్లాన్స్ ఇవే..
వొడాఫోన్ ఐడియా (వి): ఈ టెలికాం నెట్‌వర్క్‌లో రూ.200 తక్కువ ధరలో బెస్ట్ డేటా, కాలింగ్ ఆఫర్స్ ఇస్తోంది.
రూ.149కే రోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 1 జీబీ డేటా అందిస్తోంది. 21 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ అందిస్తోంది. అయితే ఈ ప్లాన్‌లో ఎలాంటి ఎస్ఎస్ఎస్ బెనిఫిట్స్ లేవు.
దీనితో పాటు రూ.155 ధరతో కూడా ఓ ప్లాన్‌ను అందిస్తోంది 'వి'. ఈ ప్లాన్ ద్వారా 1 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ వంటి సదుపాయాలను 24 రోజుల వరకు పొందొచ్చు.
ఇవే కాకుండా.. రూ.179 ప్లాన్‌తో ప్రతి రోజు 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్లు అందిస్తోంది వి. ఈ ప్లాన్ వ్యాలిటిడీ 28 రోజులుగా నిర్ణయించింది.
ఎయిర్టెల్..
ఎయిర్టెల్ 200 లోపు బెస్ట్ డేటా ప్లాన్ అందిస్తోంది. రూ.179తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిటిడీతో.. ప్రతి రోజూ 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్‌తో పాటపు మొత్తం 300 ఎస్ఎంఎస్లు పంపించుకునే వీలు కల్పిస్తోంది. ఈ ప్లాన్‌లో రోజు వారీ డేటా పూర్తయిన తర్వాత ప్రతి ఎంబీ డేటాకు 50 పైసల చొప్పున ఛార్జ్ వసూలు చేయనుంది.
రూ.155తో కూడా మరో ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది ఎయిర్టెల్. ఈ ప్లాన్‌తో 28 రోజులకు అన్లిమిటెడ్ కాల్స్, 1 జీబీ డేటా (రోజూ) అందిస్తోంది.
ఇక ఎయిర్టెల్ అందించే అదనపు ఫీచర్లు ఏమిటంటే.. అమెజాన్ మొబైల్ ఎడిషన్ సబ్స్క్రిప్షన్, వింక్ వంటి సదుపాయాలను ఉచితంగా వాడుకోవచ్చు.
జియో బడ్జెట్ ప్లాన్స్..
జియో బడ్జెట్ ధరలు వివిధ ప్లాన్స్ అందుస్తోంది. రూ.119 ప్లాన్‌తో ప్రతరి రోజు రూ.1.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్స్ సహా జియో యాప్స్‌ను ఉచితంగా వాడేందుకు వీలు కల్పిస్తోంది. 14 రోజుల వ్యాలిడిటీతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
ఇక రూ.179 ప్లాన్‌తో మరో అదిరే ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. 24 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా ప్రతి రోజు 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. జియో యాప్స్ అన్ని ఉచితింగా వాడుకోవచ్చు.
బీఎస్ఎన్ఎల్ ఆఫర్స్..
ప్రభుత్వం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా రూ.200 లోపు బెస్ట్ ఆఫర్స్ అందిస్తోంది. రూ.99 ప్లాన్‌తో 22 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకునే వీలుంది.
రూ.118 ప్లాన్‌తో.. 26 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్.. ప్రతి రోజు 500 ఎంబీ డేటా అందిస్తోంది బీఎస్ఎన్ఎల్.
Also read: Flight fares: భారీగా తగ్గనున్న విమాన ఛార్జీలు- కారణాలివే..!
Also read: Flipkart Realme 8: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.2,099 ధరకే రియల్ మీ స్మార్ట్ ఫోన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook