పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా కలైకుండ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి మంగళవారం మధ్యాహ్నం గాల్లోకి టేకాఫ్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) విమానం కొద్దిసేపట్లోనే ఒడిషాలో కుప్పకూలిపోయింది. ఒడిషాలోని మయుర్‌భంజ్ జిల్లాలో ఐఏఎఫ్ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన టైనీ పైలట్‌ని స్థానికులే ఆ విమానం లోంచి వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కోర్టు విచారణకు ఆదేశించనున్నట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పష్టంచేసింది. రోజువారి విధుల్లో భాగంగానే ఈ ఐఏఎఫ్ విమానం టేకాఫ్ అయినట్టు ఐఏఎఫ్ ప్రకటించినట్టు తెలుస్తోంది.
#SpotVisuals Indian Air Force plane has crashed in Odisha's Mayubhanj pic.twitter.com/ClwlgOiRmH
— ANI (@ANI) March 20, 2018
విమానం కూలిపోయిన కాసేపట్లోనే మంటల్లో చిక్కుకుని కాలిపోయినట్టు సమాచారం అందుతోంది.