Dangers of Betel Nuts: అపుడపుడు తినే వక్కపొడి వలన ఆరోగ్యానికి ఎన్ని ప్రమాదాలో తెలుసా..??

మన దేశంలో వక్కపొడి వాడకం చాలా సాధారణం. వీటి వలన ఆరోగ్యం పాడవటమే కాకుండా, క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధుల భారినపడే అవకాశం ఉంది. వక్కపొడి తినటం వలన కలిగే నష్టాల గురించి ఇపుడు తెలుసుకుందాం.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2022, 02:00 PM IST
  • WHO ప్రకారం, వక్కపొడులు ఆరోగ్యానికి క్షేమం కాదు
  • US & ఇతర దేశాలు వక్కపొడి దిగుమతులు నిషేధించబడ్డాయి
  • వీటి వలన క్యాన్సర్ కలిగే అవకాశాలు ఉన్నాయి
  • వక్కపొడి వాడకాన్ని మానేయమని నిపుణులు సలహా ఇస్తున్నారు
Dangers of Betel Nuts: అపుడపుడు తినే వక్కపొడి వలన ఆరోగ్యానికి ఎన్ని ప్రమాదాలో తెలుసా..??

Health Dangers of Betel Nuts: మన దేశంలో మరియు ఇతర సరిహద్దు దేశాలలో వక్కపొడి  వాడకం సర్వసాధారణం. బయట దొరికే పాన్ లలో వీటిని ఎక్కువగా వాడుతుంటారు. ఏలాకులు, దాల్చిన చెక్క మరియు పొగాకులను వాడి పాన్ తయారు చేస్తారు. పొగాకు ఎంత ఆరోగ్యానికి ఎంత అనారోగ్యమో మన అందరికి తెలిసిందే. దీనితో పాటుగా వక్కపొడి కూడా ఆరోగ్యానికి హానికరం 

పాన్ లో కలిపే ఏలకులు మరియు దాల్చిన చెక్క కాకుండా ప్రతి పదార్థం క్యాన్సర్ ను కలిగిస్తుందని "ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్" జరిపిన పరిశోధనలలో వెల్లడించబడింది. క్యాన్సర్ కలుగచేసే కారకాలతో వక్కపొడి మొదటి స్థానంలో ఉంటుందని.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, వక్కపొడి క్యాన్సర్ ను కలుగచేసే గుణాలను కలిగి ఉంటుందని తెలిపారు. 

మీకు ఇప్పటికే వక్కపొడి రోజు తినే అలవాటు ఉందా.. ?? అయితే మీ ఆరోగ్యం ఎంత వరకు పాడైందో ఒకసారి చూద్దాం.. 

క్యాన్సర్ 
వక్కపొడి తినటం వలన క్యాన్సర్ కలిగే అవకాశం ఉందని, ముఖ్యంగా నోటి మరియు అన్నవాహిక క్యాన్సర్ కు గురయ్యే అవకాశం ఉందని చాలా పరిశోధనలలో వెల్లడించబడింది. వక్కపొడి ఎక్కువగా నమిలే వారిలో సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ అధికంగా ఉత్పత్తి చెందుతుంది. దీని అధిక ఉత్పత్తి వలన దవడ కదలికలలో లోపాలు ఏర్పడతాయి.

గుండె సంబంధిత సమస్యలు 
వక్కపొడి మరియు గుండె సంబంధిత వ్యాధులకు ఉన్న సంబంధం గురించి చాలా పరిశోధనలు జరిగాయి. వక్కపొడిని అధికంగా తినేవారిలో గుండె సంబంధిత వ్యాధులు గురయ్యే అవకాశాలు అధికం అని, వీటితో పాటుగా, మెటాబొలిక్ సిండ్రోమ్ మరియు స్థూలకాయత్వం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

దంత సమస్యలు 
రోజు వక్కపొడిని నమిలే వారి చిగుళ్లు చికాకులకు గురవటమే కాకుండా, దంతక్షయం కూడా కలుగుతుంది. దంతాలు శాశ్వతంగా ముదురు ఎరుపు లేదా నల్లటి రంగులోకి మారవచ్చు. వీటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురాలేము.

రసాయనిక చర్యలు
వక్కపొడి, శరీరంలో వివిధ రకాల రసాయనిక చర్యలకు గురి చేయటమేకాకుండా, హెర్బల్ ఔషదాలతో మరియు తీసుకునే అల్లోపతి మందులతో కూడా చర్య జరుపుతుంది. అంతేకాకుండా, ఇవి మందుల యొక్క సామర్థ్యాన్ని తగ్గించి వేస్తుంది.

ఇతర ప్రభావాలు
రోజు వక్కపొడి నమలటం వలన శరీరంలో ప్రమాదక చర్యలకు ప్రోత్సహిస్తాయి. వక్కపొడిని నమలటం అనారోగ్యకరమని వైద్యులు సలహా ఇస్తున్నారు.  

Also Read: Petrol price Today: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు- హైదరాబాద్​లో సెంచరీ కొట్టిన డీజిల్​..

Also Read: SRH vs RR: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో షాక్, భారీ జరిమానా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News