iPhone Thefts: సెల్‌ఫోన్ల దిగ్గజం యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ సెల్‌ఫోన్ల చోరీలకు చెక్ పెట్టేందుకు కొత్త పాలసీని తీసుకొస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇకపై దొరికిన, దొంగిలించిన ఫోన్లకు రిపేర్ చేయబోమని యాపిల్ సంస్థ స్పష్టం చేసింది. అయితే ఫోన్ పోయిందని లేదా చోరి చేశారని గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ (GSMA) డివైజ్ రిజిస్ట్రీలో రిజిస్టర్ అయ్యి ఉన్న ఫోన్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఆ సంస్థ వెల్లడించింది.
GSMA వెబ్‌సైట్ ప్రకారం.. ఒకవేళ మొబైల్ పోయినట్లు, చోరికి గురైనట్లు ఆ డివైజ్ యజమాని గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ రిజిస్ట్రీలో ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని యాపిల్ సంస్థ తెలిపింది. అయితే, ఈ రిజిస్ట్రేషన్‌కు మాత్రం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి డివైజ్ గురించి ఈ రిజిస్ట్రీలో నమోదు అయ్యాక దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయా సర్వీసు సెంటర్‌లకు GSMA సమాచారం అందిస్తుంది.
ఇంతకు ముందు యాపిల్ ఫోన్లలో ఫైండ్ మై ఐఫోన్ యాక్టివేషన్‌లో ఉంటేనే ఫోన్లను కంపెనీ రిపేర్ చేసేది. ’’ఒకవేళ ఫైండ్ మై ఐఫోన్ టర్న్ ఆఫ్ చేసి ఉంటే, మీ డివైజ్‌కు సేవలు అందించలేకపోవచ్చు. మీ ఫోన్ మీకు తెలియకుండా ఎవరైనా సర్వీసింగ్‌కు తీసుకొస్తే దాన్ని నియంత్రించడానికి ఈ విధానం అమలులో ఉంది’’ అని యాపిల్ సంస్థ తన సపోర్ట్ పేజీలో వెల్లడించింది.
ఈ పాలసీ ద్వారా ఐఫోన్ చోరీలను తగ్గించాలనేది యాపిల్ సంస్థ ముఖ్య ఉద్దేశం. అయితే యాపిల్ యూజర్లు తమ ఐఫోన్లలో ఫైండ్ మై ఫోన్ అనే ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకొని ఉండాలని సంస్థ సూచించింది.ఒకవేళ ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయకున్నా, ఫోన్ లాక్ వేసి లేకపోయినా ఐఫోన్ చోరీని అడ్డుకోవడం సాధ్యపడదని యాపిల్ సంస్థ వెల్లడించింది.
Also Read: Petrol Diesel Price Hike: ఆగని పెట్రో బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook