China Covid Restrictions: చైనా ఆర్థిక రాజధాని షాంఘైని కరోనా వణికిస్తోంది. కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ఇటీవలే అక్కడ లాక్‌డౌన్‌ను పొడగించారు. లాక్‌డౌన్‌లో భాగంగా అత్యంత కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల నుంచి ఇళ్ల నుంచి బయటకు అనుమతించట్లేదు. దీంతో అక్కడి ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు. కోవిడ్ ఆంక్షల అమలుకు అక్కడ డ్రోన్లు, రోబోటిక్ డాగ్స్‌ను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు.
గగనతలంలో డ్రోన్లు, వీధుల్లో రోబోటిక్ డాగ్స్‌ను ఉపయోగించి చైనా అధికారులు కోవిడ్ ఆంక్షలను ప్రచారం చేస్తున్నారు. వీటికి సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే హెల్త్ కేర్ వర్కర్స్ కూడా వీధుల్లో మైక్స్‌తో కోవిడ్ ఆంక్షలను ప్రచారం చేస్తున్నారు. 'ఈరోజు రాత్రి నుంచి కపుల్స్ అంతా వేర్వేరుగా నిద్రించాల్సిందే. అలాగే, ముద్దులు, కౌగిలింతలకు దూరంగా ఉండాలి. తినేటప్పుడు కూడా వేర్వేరుగా తినాలి. మీ సహకారానికి ధన్యవాదాలు...' అంటూ ఓ హెల్త్ కేర్ వర్కర్ షాంఘై వీధుల్లో ప్రచారం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వెలుగుచూసింది.
తమను ఇళ్లకు పరిమితం చేసి.. నిత్యావసరాలు సప్లై చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ పలువురు షాంఘై వాసులు తమ బాల్కనీల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. అయితే ఇలా నిరసనలు తెలపవద్దని చైనీస్ అధికారులు స్థానికులను హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు డ్రోన్స్‌తో ప్రచారం నిర్వహిస్తున్నారు. షాంఘైలో ప్రజల అవసరాలకు తగిన నిత్యావసర వస్తువులు ఉన్నాయని... అయితే పంపిణీలో తలెత్తుతోన్న సమస్యల వల్ల కొంత ఆలస్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
కొద్దిరోజుల క్రితం వరకు షాంఘైలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో కోవిడ్ ఆంక్షలు విధించారు. కానీ ఏప్రిల్ 4న 13వేల పైచిలుకు కేసులు నమోదవడంతో నగరమంతా లాక్‌డౌన్ విధించారు. కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని చైనా ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే షాంఘైలో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు.
As seen on Weibo: Shanghai residents go to their balconies to sing & protest lack of supplies. A drone appears: “Please comply w covid restrictions. Control your soul’s desire for freedom. Do not open the window or sing.” https://t.co/0ZTc8fznaV pic.twitter.com/pAnEGOlBIh
— Alice Su (@aliceysu) April 6, 2022
This is more funny. “From tonight, couple should sleep separately, don’t kiss, hug is not allowed, and eat separately. Thank you for your corporation! “ pic.twitter.com/ekDwLItm7x
— Wei Ren (@WR1111F) April 6, 2022
Also Read: Zuck Bucks: మెటా నుంచి డిజిటల్ కరెన్సీ.. 'జుక్ బక్స్' పేరుతో..?
RGV Dangerous: రాంగోపాల్ వర్మ లెస్బియన్ మూవీ 'డేంజరస్' విడుదల వాయిదా...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
China: షాంఘై కపుల్స్‌కి చైనా హెచ్చరిక.. కలిసి పడుకోవద్దు.. ముద్దులు, కౌగిలింతలకు దూరంగా ఉండాలి..
షాంఘైలో కోవిడ్ కఠిన ఆంక్షలు
డ్రోన్లు, రోబోటిక్ డాగ్స్, హెల్త్ కేర్ వర్కర్స్‌తో ప్రచారం
కపుల్స్‌కి హెచ్చరిక జారీ చేసిన చైనా