PAN Aadhaar: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ).. పాన్-ఆధార్ లింక్ చేసేందుకు మార్చి 31తో గడువును ముగించింది. అయినప్పటికీ జరిమానాతో ఇంకా కొంత కాలం పాటు పాన్-ఆధార్ లింక్ చేసేందుకు అవకాశం ఉంది. మరి ఫైన్‌తో ఈ ప్రక్రియ ముగించేందుకు గడువు ఎప్పటి వరకు ఉంది? పాన్-ఆధార్ అనుసంధానం చేయకుంటే వచ్చే సమస్యలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
పాన్-ఆధార్ లింక్ చేసేందుకు తుది గడువు మార్చి 31తో ముగిసినప్పటికీ.. సీబీడీటీ కొంత ఊరటనిచ్చింది. జరిమానాతో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు 2023 మార్చి 31 వరకు అకాశం కల్పించింది. అందులో ఈ ఏడాది జూన్ వరకు రూ.500 జరిమానా ఆ తర్వాత రూ.1000 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఫైన్‌తో కూడా పాన్-ఆధార్ లింక్ చేయకుంటే.. ఆ పాన్ కార్డులు నిరుపయోగంగా మారుతాయని వెల్లడించింది సీబీడీటీ. దీనర్ధం పాన్ నంబర్ పని చేయదు.
పాన్ ఇన్ యాక్టివ్‌గా మారితే.. బ్యాంకు లావాదేవీలపై పరిమితులు ఉంటాయి. పెట్టుబడులు పెట్టలేరు (స్టాక్ మార్కెట్ల వంటివాటిలో). ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయడం కూడా కుదరదు.
పాన్ నిరుపయోగంగా మారితే.. రీఫండ్స్ కూడా రావు. దీనితో ఆదాయపు పన్ను విభాగం నుంచి భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి రావచ్చు.
పాన్ నిరుపయోగంగా మారిన వారి నుంచి సాధారణం కన్నా అధికంగా పన్ను వసూలు చేయనున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది.
Also read: FASTag collections: రికార్డు స్థాయిలో ఫాస్టాగ్ వసూళ్లు..మార్చిలో ఎంతంటే..?
Also read: Renault offers: రెనో కార్లపై అదిరే ఆఫర్లు.. రూ.1.1 లక్షల వరకు డిస్కౌంట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook