Weekly Horoscope: రాశి ఫలాలు ఏప్రిల్ 11-ఏప్రిల్ 17... ఆ రాశి వారికి ఆర్థిక నష్టాలు తప్పకపోవచ్చు..

Weekly Horoscope Predictions: ఈ వారం (11 ఏప్రిల్ నుండి 17 ఏప్రిల్ 2022 వరకు) రాశిచక్రంలో ఏయే రాశుల వారికి ఎలా ఉండనుంది... ఎవరికి కలిసొస్తుంది... ఎవరికి కలిసిరాదు... వీటికి సంబంధించి ఆస్ట్రో గురు బేజన్ దరువాలా కుమారుడు చిరాగ్ దరువాలా వెల్లడించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2022, 03:49 PM IST
  • ఏప్రిల్ 11-ఏప్రిల్ 17 వారం ఫలాలు
  • ఏ రాశి వారికి ఎలా ఉండనుంది.. ఎవరికి కలిసిరానుంది..
  • ఆస్ట్రో గురు చిరాగ్ దరువాలా వెల్లడించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి
Weekly Horoscope: రాశి ఫలాలు ఏప్రిల్ 11-ఏప్రిల్ 17... ఆ రాశి వారికి ఆర్థిక నష్టాలు తప్పకపోవచ్చు..

Weekly Horoscope Predictions: భారతీయుల్లో చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసిస్తారు. ఏ శుభకార్యం మొదలుపెట్టాలన్నా మంచి రోజు, మంచి ముహూర్తం చూసుకునే మొదలుపెడుతారు. అందుకే ఎప్పటికప్పుడు పండితుల నుంచి రాశి ఫలాల గురించి తెలుసుకుంటుంటారు. ఏవైనా దోషాలు ఉంటే అవి తీరిపోయేందుకు సలహాలు కోరుతారు. మరి.. ఈ వారం (11 ఏప్రిల్ నుండి 17 ఏప్రిల్ 2022 వరకు) రాశిచక్రంలో ఏయే రాశుల వారికి ఎలా ఉండనుంది... ఎవరికి కలిసొస్తుంది... ఎవరికి కలిసిరాదు... వీటికి సంబంధించి ఆస్ట్రో గురు బేజన్ దరువాలా కుమారుడు చిరాగ్ దరువాలా వెల్లడించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం : ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుందని వినాయకుడు చెప్తున్నాడు. మీరు కొనసాగుతున్న రంగంలో అధికారుల నుంచి మీకు తగిన సహకారం లభిస్తుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. ఇంటికి ధనం చేరుతుంది. వ్యాపారంలో అదృష్టం ఉంటుంది. భగవంతునిపై మీ విశ్వాసం పెరుగుతుంది. మీరు మీ శత్రువులపై ఆధిపత్యం చలాయిస్తారు. అవసరంలో ఉన్న మీ స్నేహితులకు కొంత సాయం చేస్తారు.

వృషభం : ఈ వారం మీకు పలు మార్గాల్లో సంపద చేకూరతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. జీవిత భాగస్వామి, పిల్లలతో సంతోషంగా గడుపుతారు. ఈ వారం మీకో శుభవార్త అందుతుంది. మీరు అవివాహితులైతే ఈ వారం వివాహ సంబంధాలు కుదరవచ్చు. మీ ప్రత్యర్థులపై విజయం సాధించగలరు.

మిథునం : ఈ వారం న్యాయపరమైన వివాదాలు, కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎప్పుడూ వెనుకాడరు. ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ప్రతికూల పరిస్థితుల్లోనూ నెగ్గుకొస్తారు. ఇతరుల భాగస్వామ్యంతో చేసే పనులు మీకు విజయాన్ని అందిస్తాయి. డబ్బు సంపాదించడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. దైవిక సహాయం మీకు తోడుగా ఉంది.

కర్కాటకం: ఈ వారం మీకు ప్రభుత్వ రంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారపరమైన ప్రయాణాలు చేస్తారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల చదువులకు అధిక ధనం వెచ్చిస్తారు. పిల్లలు ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. మీరు చేసే వ్యాపారం లేదా ఉద్యోగంలో మీ పట్ల గౌరవం మరింత పెరుగుతుంది. ఉన్నత స్థానాల్లోని వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకుంటారు.

సింహం: ఈ వారం మీకు ఆర్థికంగా నష్టాలు తప్పకపోవచ్చు. మీరు ఉన్న రంగంలో మీ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. భగవంతునిపై మీ విశ్వాసం పెరుగుతుంది. మీరు మతపరమైన కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అయితే మీ సోదరులు లేదా అక్కాచెల్లెళ్ల పరిస్థితిపై కొంత ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులను కొత్త ఉత్సాహంతో పూర్తి చేస్తారు. అది మీకు అన్నివిధాలా కలిసొస్తుంది.

కన్య: రాజకీయపరంగా మీకు విజయావకాశాలు ఉంటాయి. ప్రభుత్వోద్యోగంలో ఉన్నవారితో స్నేహం ఏర్పడవచ్చు. స్వభావ రీత్యా మీరు దయగలవారు. ఇతరుల మేలు కోసం పని చేస్తారు. ఈ వారం మీకు అన్నివిధాలా కలిసొస్తుంది. మీరు ఇచ్చే సలహాలు సైతం ఇతరులకు బాగా ఉపయోగపడుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై కాస్త శ్రద్ద వహించాలి.

తుల : ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. అయితే మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ స్వభావం, ప్రవర్తనలో పరిపక్వత కనిపిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. మీ ప్రసంగంలో మాధుర్యం ఉంటుంది. దాని కారణంగా మీరు ఇతరులను మీ వైపు ఆకర్షించగలుగుతారు. అంతా బాగానే ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

వృశ్చికం : ఈ వారం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. చుట్టుపక్కల వారి నుంచి శుభవార్తలు వింటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభాల వల్ల ఆనందాన్ని పొందుతారు. అయితే పెరుగుతున్న పని భారంతో ఒత్తిడికి గురవుతారు. కుటుంబంలో శుభకార్యాల వల్ల మనసుకు సంతోషంగా ఉంటుంది. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి.

ధనుస్సు : ఈ వారం వ్యాపారంలో కాస్త ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబానికి సంబంధించిన ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. మీ ప్రతిభ, వాక్చాతుర్యం కారణంగా ఇతరులు మీవైపు ఆకర్షితులవుతారు.

మకరం : కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు పనిచేసే కార్యాలయంలో సహోద్యోగులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. కీర్తి ప్రతిష్టలు పెరగవచ్చు. ధార్మిక కార్యాలలో, శ్రేష్ఠ కార్యాలలో పూర్తి భక్తితో సహకరిస్తారు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మీ పరిచయాలు మరింత పెరుగుతాయి.

కుంభం: ఈ వారం మీరు చేపట్టిన పనులన్నీ కలిసొస్తాయి. అయితే ఆర్థికంగా కొంత డబ్బు అవసరం ఏర్పడవచ్చు. దీంతో రుణం పొందే మార్గాలపై దృష్టి సారిస్తారు. వైవాహిక జీవితంలో విభేదాలు ఇబ్బంది పెడుతాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ-వ్యాపారాలలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 

మీనం: ఈ వారం దానధర్మాలకు ఖర్చు చేస్తారు. మీరు చేపట్టే పనులకు మీ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల నుంచి అన్ని రకాల మద్దతును పొందుతారు. ప్రతి పనిని చాకచక్యంతో సులభంగా చేయగలుగుతారు. మతపరమైన కార్యకలాపాలకు మొగ్గు చూపుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. 

Also Read: AP Cabinet 2.0: ఏపీ కొత్త కేబినెట్.. 25 మందితో జాబితా రెడీ... లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?

Harshal Patel: బయోబబుల్‌ వీడిన బెంగళూరు స్టార్ బౌలర్‌.. చెన్నైతో మ్యాచ్‌లో ఆడేది అనుమానమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News