Yuzvendra Chahal argument with On-Field Umpire over wide ball: ఐపీఎల్ 15వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులకు పరిమితం అయింది. 4 వికెట్లు పడగొట్టి రాజస్థాన్ విజయంలో యుజ్వేంద్ర చహల్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచులో చహల్ ఆన్-ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
విషయంలోకి వెళితే... లక్నో సూపర్‌జెయింట్స్ ఛేజింగ్ చేస్తుండగా రాజస్థాన్ రాయల్స్ మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ 18వ ఓవర్ బౌలింగ్ చేశాడు. 18వ ఓవర్లోని ఐదో బంతి చహల్ వేయగా.. లక్నో ఆటగాడు దుష్మంత చమీరా షాట్ ఆడాడు. బంతి కాస్త బాగా స్పిన్ అయి చమీరాకు చిక్కకుండా వికెట్ కీపర్ సంజు శాంసన్ చేతుల్లోకి వెళ్లింది. వెంటనే ఫీల్డ్ అంపైర్ ఆ బంతిని వైడ్‌గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయంపై చహల్ అసంతృప్తి చెందాడు. అది ఎలా వైడ్ అవుద్ది అంటూ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
యుజ్వేంద్ర చహల్ వేసిన బంతి వైడ్ కాదని వ్యాఖ్యాతలు కూడా అన్నారు. వైడ్ కాదంటూ యుజ్వేంద్ర చహల్ అంపైర్‌తో వాదిస్తుండగా.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ వచ్చి సర్దిచెప్పాడు. రాజస్థాన్ జట్టు కెప్టెన్‌కు కూడా ఆ బంతి వైడ్ కాదని తెలిసినా.. అంపైర్‌తో మాత్రం అతడు యేమి మాట్లాడకుండా చహల్‌కు బంతిని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇందుకు సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
— Vaishnavi Sawant (@VaishnaviS45) April 10, 2022
ఇక ఐపీఎల్లో యజ్వేంద్ర చహల్ ఓ మైలురాయిని అందుకున్నాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో దుష్మంత చమీరాను ఔట్ చేయడం ద్వారా చహల్ మెగా టోర్నీలో 150వ వికెట్ సాధించాడు. దాంతో ఐపీఎల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్న ఆరో బౌలర్‌గా చహల్ రికార్డుల్లో నిలిచాడు. ఈ జాబితాలో డ్వేన్ బ్రావో 173 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. లసిత్ మలింగ 170 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
Also Read: Athiya Shetty: కేఎల్ రాహుల్ గోల్డెన్ డక్.. ముక్కలైన అతియా శెట్టి మనసు! రియాక్షన్ చూస్తే అంతే..
Also Read: Acharya Trailer: చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. థియేటర్లలో 'ఆచార్య' ట్రైలర్! ఎక్కడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook