Ramcharan: పంజాబ్​లో RC 15 షూటింగ్... బీఎస్​ఎఫ్​ జవాన్లకు రామ్​చరణ్ స్పెషల్ ట్రీట్

Ramcharan: మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​ RC 15 షూటింగ్​ పంజాబ్​లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ మధ్యలో చరణ్...అమృతసర్ సమీపంలోని ఖాసా ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఉన్న  బీఎస్​ఎఫ్​ సైనికులతో ముచ్చటించారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 08:14 PM IST
  • పంజాబ్​లో జోరుగా RC 15 షూటింగ్
  • బీఎస్​ఎఫ్​ జవాన్లతో గడిపిన రామ్​చరణ్
  • గోల్డెన్​ టెంపుల్​ను సందర్శించిన ఉపాసన
Ramcharan: పంజాబ్​లో RC 15  షూటింగ్... బీఎస్​ఎఫ్​ జవాన్లకు రామ్​చరణ్ స్పెషల్ ట్రీట్

Ramcharan With BSF Soldiers: మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​- స్టార్ డైరెక్టర్ శంకర్​ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాను RC 15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‏తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయికగా కియారా అద్వానీ నటిస్తోంది.  

ఈ చిత్రంలో చెర్రీ  (Ramcharan) ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ (RRR) ఇప్పటికే రిలీజై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. మరోవైపు తన తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది.

ప్రస్తుతం RC 15  ప్రాజెక్టు షూటింగ్ పంజాబ్​లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో చరణ్.. అమృత్​సర్​లోని ఖాసా ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న బీఎస్​ఎఫ్​ క్యాంపుకు వెళ్లి జవాన్లతో (BSF soldiers) గడిపారు. అంతేకాకుండా సైనికుల కోసం ప్రత్యేక వంటకాలు తయారు చేయించి... వారితో కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.  అంతకుముందు రామ్​చరణ్​ సతీమణి ఉపాసన.. అమృత్​సర్​లోని గోల్డెన్​ టెంపుల్​ను సందర్శించారు. 

Also Read: Allu Arjun: భారీ ఆఫర్‌ను తిరస్కరించిన అల్లు అర్జున్‌.. అసలు కారణం ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News