Rashmika Vijay: రష్మిక మందన్నకు విజయ్ దేవరకొండ ప్రపోజల్.. నేషనల్ క్రష్ ఒకే చెప్పేసిందా?

Rashmika Mandanna Item Song. లైగర్ సినిమాలో రష్మిక ఐటెం సాంగ్ చేస్తే బావుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే రష్మిక వద్దకు ఈ ప్రపోజల్‌ను విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్  తీసుకెళ్లారట.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2022, 11:28 PM IST
  • రష్మిక మందన్నకు విజయ్ దేవరకొండ ప్రపోజల్
  • నేషనల్ క్రష్ ఒకే చెప్పేసిందా?
  • నిజమైతే రష్మికకు ఇదే తొలిసారి
Rashmika Vijay: రష్మిక మందన్నకు విజయ్ దేవరకొండ ప్రపోజల్.. నేషనల్ క్రష్ ఒకే చెప్పేసిందా?

Rashmika Mandanna to Do Item Song In Vijay Devrakoda new movie Liger: ఓ సినిమాలో ఎంత పెద్ద స్టార్లు ఉన్నా.. ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టినా.. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యేది మాత్రం 'ఐటమ్ సాంగ్'. ఇటీవలి కాలంలో దాదాపుగా ప్రతి సినిమాలో స్టార్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చెయ్యడంతో సినిమా లుక్కే ఒక్కసారిగా మారిపోతోంది. ప్రేక్షకులు కూడా ఈ స్పెషల్ సాంగ్స్‌లు బాగా అలవాటు పడ్డారు. ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ ట్రెండ్ పెరగడంతో ప్రేక్షకులని ఎట్రాక్ట్ చెయ్యడానికి స్పెషల్ సాంగ్స్ మీద స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. ఇది బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలలో ఉన్నదే. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అంతా ఇప్పటికే ఐటమ్స్ సాంగ్ చేసి సత్తాచాటిన విషయం తెలిసిందే. స్టాలిన్‌లో అనుష్క శెట్టి, తులసిలో శ్రేయ సరన్, అల్లుడు శీనులో తమన్నా, నాయక్‌లో ఛార్మి, జనతా గ్యారేజ్‌లో కాజల్, ఆగడులో శృతి హాసన్, రంగస్థలంలో పూజా హెగ్డే, సరైనోడులో అంజలి, సరిలేరు నీకెవ్వరులో తమన్నా, రెడ్‌లో హెబ్బా పటేల్, సీతలో పాయల్ రాజపుత్, పుష్పలో సమంత, గనిలో తమన్నా, ఆచార్యలో రెజీనా కాసాండ్రా స్పెషల్ సాంగ్స్‌ చేసి ఔరా అనిపించారు. ఇక ఇప్పుడు నేషన్ క్రష్ రష్మిక మందన్న వంతు వచ్చినట్టుంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లైగర్'. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తున్నారు.  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని తెలుగులో పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూరి కాబట్టి లైగర్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ కోసం ఇప్పటికే కేజీఎఫ్ 2 హీరోయిన్ శ్రీనిధి శెట్టిని ఎంపిక చేశారని వార్తలు వచ్చినా.. అందులో నిజం లేదని తెలిసింది. తాజాగా శ్రీనిధి స్థానంలో రష్మిక మందన్న పేరు వినిపిస్తోంది. 

లైగర్ సినిమాలో రష్మిక ఐటెం సాంగ్ చేస్తే బావుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే రష్మిక వద్దకు ఈ ప్రపోజల్‌ను విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్  తీసుకెళ్లారట. విజయ్‌తో ఉన్న స్నేహం కారణంగా నేషనల్ క్రష్ ఓకే చెప్పిందని సమాచారం. మరి ఇందులో నిజమెంత తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం డాన్స్ పండగ చేసుకుంటారు. మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది. ఒకవేళ చేస్తే రష్మికకు ఇదే తొలి ఐటమ్ కానుంది. 

Also Read: Pooja Hegde Red Saree: రెడ్ సారీలో పూజా హెగ్దే.. దేశీ అవతార్‌ బలేగుంది!

Also Read: Janhvi Kapoor Pics: కోటలో యువరాణి.. పెళ్లి కూతురి డ్రెస్సులో జాన్వీ కపూర్ తగ్గేదేలే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News