TS Police Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పోలీస్ శాఖలో 17,099 పోస్టులను భర్తీ చేయనున్న T - సర్కార్

TS Police Recruitment 2022: రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ తీపికబురు చెప్పింది. రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న 17,099  పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ ను సోమవారం (ఏప్రిల్ 25) విడుదల చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 26, 2022, 12:10 PM IST
TS Police Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పోలీస్ శాఖలో 17,099 పోస్టులను భర్తీ చేయనున్న T - సర్కార్

TS Police Recruitment 2022: తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కారు తీపికబురు చెప్పింది. ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ను సోమవారం (ఏప్రిల్ 25) విడుదల చేసింది. పోలీస్ శాఖలోని అనేక విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

అందులో భాగంగా పెద్ద ఎత్తున కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనునట్లు తెలుస్తోంది. పోలీస్ పోస్టులకు దరఖాస్తులను మే 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 17,099 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో 587 ఎస్ఐ, 414 సివిల్ ఎస్సైలతో పాటు 16,027 కానిస్టేబుల్, 66 ఏఆర్ ఎస్సై, 5 రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. 

ఈ నోటిఫికేషన్ లోని కానిస్టేబుల్స్ లో 4,965 సివిల్‌ కానిస్టేబుల్​, 4,423 ఏఆర్‌ కానిస్టేబుల్‌, 5,010 TSSP కానిస్టేబుల్‌, 587 ఎస్సై పోస్టుల భర్తీ చేయనున్నారు. వీటితో పాటు 23 TSSP సబ్ ఇన్ స్పెక్టర్, 12 SPF ఎస్సై, 26 డిజాస్టర్, ఫైర్ స్టేషన్ ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. మరోవైపు 8 డిప్యూటీ జైలర్ పోస్టులు కూడా ఉన్నాయి. 

Also Read: Yadadri CM KCR:యాదాద్రి సన్నిధిలో మహాకుంభాభిషేక మహోత్సవం..!

Also Read: Weather Alert: తెలంగాణకు రాగల 3 రోజులు వర్ష సూచన... రాయలసీమలో తేలికపాటి వర్షాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News