Samosa Making in Toilet: సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో సమోసా, ఇతర స్నాక్స్‌ను టాయిలెట్‌లో తయారుచేస్తున్నట్లు స్థానిక అధికారులు గుర్తించారు. రెస్టారెంట్‌పై దాడులు చేసిన అధికారులు టాయిలెట్‌లో తిను బండారాలు తయారుచేయడం చూసి షాక్ అయ్యారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆ రెస్టారెంట్‌ను సీజ్ చేశారు.
అపరిశుభ్ర వాతావరణంలో స్నాక్స్ తయారుచేస్తున్నట్లు జెడ్డా మున్సిపల్ అధికారులకు సమాచారం అందడంతో రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. గత 30 ఏళ్లుగా ఆ రెస్టారెంట్‌లో టాయిలెట్‌లోనే సమోసా, ఇతర స్నాక్స్ తయారుచేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు, రెండున్నరేళ్లుగా కుళ్లిపోయిన మాంసాన్ని కూడా రెస్టారెంట్‌లో గుర్తించారు. ఇదే మాంసాన్ని వంటల్లో వినియోగిస్తున్నట్లు తెలిసి షాక్ తిన్నారు. రెస్టారెంట్‌లో పురుగులు, ఎలుకలు తిరుగుతున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న రెస్టారెంట్‌ను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
సౌదీ అరేబియాలో ఇలాంటి ఘటన వెలుగుచూడటం ఇదే తొలిసారేమీ కాదు. గతంలో ఓ ఫేమస్ షవర్మా రెస్టారెంట్‌లోనూ ఇలాంటి ఘటన వెలుగుచూసింది. రెస్టారెంట్‌లోని షవర్మాను ఎలుక తింటున్న వీడియో బయటకొచ్చింది. అదే షవర్మాను రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్స్‌కు సర్వ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ రెస్టారెంట్‌ను సీజ్ చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకూ దాదాపు 2833 సార్లు పలు హోటళ్లు, రెస్టారెంట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు 26 రెస్టారెంట్లను సీజ్ చేసినట్లు తెలిపింది.
فأر ضخم يعتلي سيخ شاورما ويأكل منه بكل راحته!
مطعم في جدة
بدون تعليق! #فيديو #متداول #فأر_الشاورما
— Reema Abuhamdieh (@ReemaAHamdieh) January 21, 2022
Also Read: Avatar 2 Trailer: జేమ్స్ కెమెరూన్ భారీ ప్లాన్.. 160 భాషల్లో 'అవతార్ 2' రిలీజ్!
Also Read: TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్... త్వరలో మరో రెండు 'డీఏ'లు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.