Bollywood film makers are scared of South Films success says Manoj Bajpaye: దేశంలో ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల హవా నడిచేది. అన్ని భాషల్లో హిందీ సినిమాలు రిలీజ్ అయి భారీ హిట్లు కొట్టేవి. అయితే బాహుబలి 1, 2 సినిమాలు.. సౌత్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్‌లో కూడా సత్తాచాటాయి. ఆతర్వాత కేజీఎఫ్ 1, పుష్ప: ది రైజ్, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు బాలీవుడ్‌లో రికార్డులు బద్దలు కొట్టాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సౌత్ సినిమాలు పెద్ద ట్రెండ్ సెట్టర్ అయ్యాయి. సాధారణ ప్రేక్షకుడి నుంచి బాలీవుడ్ ప్రముఖుల వరకు అందరూ దక్షిణాది సినిమాల జపం చేస్తున్నారు.
ఒకప్పుడు ప్రాంతీయ బాష సినిమాలంటే బాలీవుడ్ యాక్టర్లు చిన్నచూపు చూసేవారని చాలా మంది తెలిపారు. అలాంటి వారే ఇపుడు సౌత్ సినిమాలను ఆకానికి ఎక్కేస్తున్నారు. ఇటీవలే అనిల్ కపూర్ దక్షిణాది సినిమాలను ప్రమోట్ చేస్తూ ప్రశంసించారు. బాలీవుడ్ ఎంత నేర్చుకుంటే హిందీ సినీ పరిశ్రమకు అంత మంచిదని పేర్కొన్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాల గురించి మాట్లాడారు. ఈ మూడు సినిమాల వసూళ్లు బాలీవుడ్‌ను షేక్ చేశాయన్నారు. దక్షిణాది చిత్రాలతో తాను కెరీర్‌ని ప్రారంభించానని, సౌత్ సినిమాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయన్నారు.
తాజాగా సౌత్ సినిమాలపై బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయి కూడా స్పందించారు. సౌత్ సినిమాలంటే బాలీవుడ్ నిర్మాతలు భయపడుతున్నారన్నారు. ఓ జాతీయ మీడియాతో మనోజ్ బాజ్‌పేయి మాట్లాడుతూ... 'దక్షిణాదిలో చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. దక్షిణాది సినిమాల ప్రభావం బాలీవుడ్‌పై బాగానే పడింది. ఒక్క నిమిషం పాటు మనోజ్ బాజ్‌పేయిని మరియు నాలాంటి వారిని మరచిపోండి. సౌత్ సినిమాలంటే ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు భయపడుతున్నారు. సరైన సినిమా ఎక్కడ వెతకాలో వారికి తెలియడం లేదు' అని అన్నారు.
సూర్యవంశీ వంటి భారీ బడ్జెట్ హిందీ చిత్రాలు రూ. 200 కోట్లకు చేరుకోవడానికి కష్టపడుతున్నసమయంలో హిందీలో డబ్ చేయబడిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు ఎందుకు రూ. 300 కోట్లకు పైగా వసూలు చేశాయో మనోజ్ బాజ్‌పేయి వివరించారు. 'దక్షిణాదిలో ప్రపంచంలోనే అత్యుత్తమ షాట్ తీస్తారు. ఊహించిన విధంగా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తారు. సినిమాను ఓ ప్యాషన్ లా తీస్తారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు రూపొందిస్తారు. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాల మేకింగ్ అద్భుతం. ప్రతి ఫ్రేమ్‌ని వాస్తవంగా తెరకెక్కించారు. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు కేవలం డబ్బు, బాక్సాఫీస్ రికార్డుల కోసమే ప్రయత్నిస్తున్నాయి. మనల్ని మనం విమర్శించుకోలేం. ఇది మనకు ఓ గుణపాఠం' అని మనోజ్ చెప్పుకొచ్చారు.
Alos Read: Acharya Movie Tickets: ఇదేందయ్యో ఇది.. అక్కడ ఆచార్య సినిమాకు ఒకటే టికెట్ బుక్ అయిందట!
Also Read: Neha Shetty: మోడ్రెన్ డ్రెస్‌లో నేహా శెట్టి.. రాధిక అందాలకు ఫిదా అవ్వాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook