KGF 2 BOX OFFICE COLLECTIONS: వెయ్యి కోట్లు రాబట్టిన కేజీఎఫ్ 2

KGF 2 BOX OFFICE COLLECTIONS: రికార్డు స్థాయిలో కేజీఎఫ్‌ 2 వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ వెయ్యి కోట్లు రాబడితే.. హిందీలో ఏకంగా 350 కోట్ల కలెక్షన్స్ దక్కించుకుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 09:11 PM IST
  • వెయ్యి కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్న కేజీఎఫ్‌ 2
  • వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన నాలుగో మూవీ

    బాలీవుడ్ రికార్డు స్థాయిలో వసూళ్లు
KGF 2 BOX OFFICE COLLECTIONS: వెయ్యి కోట్లు రాబట్టిన కేజీఎఫ్ 2

KGF 2 BOX OFFICE COLLECTIONS: కేజీఎఫ్ 2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అన్ని భాషల్లో బాక్సాఫీసులు బద్దల కొడుతూ దూసుకువెళుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ -2.. వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కేవలం 15 రోజుల్లో ఈ రికార్డు సాధించింది. దంగల్, బాహుబలి2, ట్రిపుల్ ఆర్ తర్వాత వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన నాలుగో మూవీగా నిలిచింది. సాండిల్ వుడ్ లో వెయ్యి కోట్లు దాటిన తొలి మూవీ కూడా కేజీఎఫ్ 2 కావడం విశేషం.

హిందీలోనైతే రికార్డు దిశగా కేజీఎఫ్ 2 అడుగులు వేస్తోంది. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా కేజీఎఫ్ 2 నిలిచింది. కేవలం హిందీ వెర్షన్‌లోనే 350 కోట్లు మార్క్ క్రాస్ చేసింది. హిందీ సినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా టైగర్ జిందా హై, పీకే, సంజు చిత్రాలు నిలిచాయి. ఇప్పుడా వరుసలో కేజీఎఫ్ 2 దూసుకుపోతోంది.

హిందీలో కేజీఎఫ్‌ రెండో వారం కలెక్షన్స్ చూస్తే.. శుక్రవారం రూ. 11.56 కోట్లు, శనివారం రూ. 18.25 కోట్లు, ఆదివారం రూ. 22.68 కోట్లు దక్కించుకుంది. సోమవారం రూ. 8.28 కోట్లు, మంగళవారం రూ. 7.48 కోట్లు, బుధవారం రూ. 6.25 కోట్లు, గురువారం 5.68కోట్లను రాబట్టింది. అంటే మొత్తం కేజీఎఫ్‌ 2 హిందీ వెర్షన్ 350 కోట్లు దాటింది. 2019 తర్వాత హిందీలో 350 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిన తొలి మూవీ కేజీఎఫ్ చాఫ్టర్ 2 కావడం విశేషం.

సినిమా ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్  అంచనాల ప్రకారం, ఈ సినిమా మొదటి రోజు 50 కోట్లు, రెండు రోజుల్లో 100 కోట్లు, నాలుగో రోజు 150 కోట్లు, ఐదు రోజుల్లో 200 కోట్లు వసూలు చేసింది. ఆరో రోజుకు రూ.225 కోట్లు రాబడితే.. తొమ్మిదో రోజుకు రూ. 275 కోట్లు రాబ్టటింది. 15వ రోజు 10 కోట్లు సొంతం చేసుకుంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంజయ్ దత్, రవీనా టాండన్ ,  శ్రీనిధి శెట్టి, మాళవిక అవినాష్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేజీఎఫ్‌ 1, కేజీఎఫ్ 2 గ్రాండ్ సక్సెస్ కావడంతో మూడో సిరీస్ ఉండొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

 

Also Read:Ramya Murder Case Verdict: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో సంచలన తీర్పు.. దోషికి ఉరి శిక్ష!

Also Read: Bjp Slogans at Minster Prasanth Reddy: మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎదుట జైశ్రీరాం నినాదాలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News