Yadadri Parking Fee:మీరెప్పుడైనా ఓ టెంపుల్ కి వెళ్తే కారు పార్కింగ్ ఫీజు ఎంత చెల్లించి ఉంటారు..? మహా అయితే ఓ వంద రూపాయల్లోపు. అది కూడా ప్రసిద్ధి చెందిన దేవాలయం అయితే. కానీ ఈ మధ్యే పునర్ నిర్మాణం చేసుకున్న యాదాద్రి ఆలయంలోని కొండపై కారు పార్కింగ్ చేయాలంటే మీ పర్సు నిండుగా ఉండాలి. అంతలా చెల్లించేందుకు మీకు గుండె ధైర్యం కూడా ఉండాలి. ఇంతకీ యాదగిరీశుడు కొలువైన ఆ స్థలంలో కారు పార్కింగ్ ఛార్జీ ఎంతో తెలుసా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగమశాస్త్రం ప్రకారం పునర్ నిర్మించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి భక్తుల రాక కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో తొలుత కొండపైకి ప్రైవేటు వాహనాలను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పుడు అధికారులు మనసు మార్చుకున్నారు. కొండపైకి కూడా ప్రైవేటు వాహనాలను అనుమతించి భక్తుల నుంచి అందినకాడికి గుంజాలని డిసైడయ్యారు. కొండపై వాహనాలను పార్క్ చేస్తే గంటల రూపంలో ఛార్జీలు వసూలు చేయనున్నారు.
మొదటి గంటకు కారు పార్కింగ్ ఫీజును 500 రూపాయలుగా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతి గంటకు అదనంగా మరో వంద రూపాయలు వసూలు చేస్తారు. ఆ వాహనాలను క్యూ కాంప్లెక్స్ఎదురుగా ఉన్న బస్టాండ్ తో పాటు, వీఐపీ గెస్టుహౌజ్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పార్క్ చేయిస్తారు. ఈ ఛార్జీలు ఆదివారం(మే1) నుంచే అమల్లోకి వస్తాయని యాదాద్రి ఆలయ ఈవో గీత సర్క్యులర్ జారీ చేశారు. ఈ బాదుడు కేవలం.. సామాన్య భక్తులకే. వీఐపీలు, దాతలు, పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చిన వారికి రూల్స్ వర్తించవు.
పెద్దమొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తామనడంపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎయిర్ పోర్టుల్లో కూడా లేనంతగా ఛార్జీలు వసూలు చేయాల్సిన అవసరం లేదంటున్నారు. దీన్ని బట్టే అర్ధమవుతోంది యాదాద్రి ఆలయ అధికారులు.. ఇప్పటినుంచే వీఐపీల సేవలో తరించేందుకు సిద్ధమవుతున్నారని మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ, కొండగట్టుతో పాటు ఏపీలోని తిరుపతి దేవస్థానంలోనూ పార్కింగ్ ఫీజు ఇంతలా ఉండదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా పార్కింగ్ బాదుడు తగ్గిస్తేనే భక్తులు సంతృప్తిగా యాదగిరీశుడిని దర్శించుకుంటారు. కొండపైకి ప్రైవేటు వాహనాల రాకపోకలను నియంత్రించేందుకే ఛార్జీల ధరలను అధికంగా నిర్ణయించామని అధికారులు ప్రకటించినా భక్తులు ఆశ్చర్యపోయేందుకు సిద్ధంగా లేరన్న విషయాన్ని వైటీడీఏ అధికారులు గుర్తుంచుకుంటే మంచిది.
Also Read: TSRTC Bus Pass Discount: పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్..
Also Read: Horoscope Today May 1st 2022: ఆ రాశి వారికి హెచ్చరిక.. తెలిసిన వ్యక్తులే నమ్మక ద్రోహం చేసే ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.