Surya Gochar 2022: రాశీచక్రంలో సూర్యుని సంచారం వల్ల ఆయా రాశుల వారి జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. వృత్తి, ఆరోగ్యం, ఉద్యోగం మొదలైన వాటిపై సూర్యుడు ప్రభావం చూపిస్తాడు. ప్రతినెలా ఒక్కో రాశిలోకి ప్రవేశించే సూర్యుడు.. ఈ నెల అనగా మే 15 నుంచి మేషరాశిని వదిలి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అలా జూన్ 15 వరకు సూర్యుడు.. వృషభ రాశిలో కొనసాగుతాడు. ఈ సంచారం కారణంగా రాశీచక్రంలోని 6 రాశులపై సానుకూల ప్రభావం ఉండనుంది. ఆ రాశుల వారు తమ కెరీర్ లో విజయాలతో పాటు ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉంది.
మేష రాశి
వృషభరాశిలోకి సూర్యుని ప్రవేశించడం వల్ల మేష రాశికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కెరీర్‌లో గొప్ప విజయం సాధించే అవకాశం ఉంది. ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. ఆర్థికంగా ఎదుగుదలకు అవకాశం కలదు.
వృషభ రాశి
సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించడంతోనే అనేక లాభాలను ఆ రాశికి తీసుకొస్తాడు. ఉద్యోగంలో పెద్ద పదవిని పొందవచ్చు. పెద్ద కంపెనీలలో ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. ఆర్థికంగా మెరుగైన పరిస్థితుల రావడం వల్ల ఈ రాశి వాళ్ల జీవితాల్లో సంతోషాలు వికసిస్తాయి.
కర్కాటక రాశి
సూర్యుని సంచారం కర్కాటక రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా రెండింటిలోను ప్రజలు పురోభివృద్ధి పొందుతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది.
సింహ రాశి
సూర్యుడు వృషభ రాశిలోకి సంచరించడం వల్ల సింహ రాశి వారికి గౌరవం, డబ్బు, స్థానం లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.
కన్యా రాశి
రాశీచక్రంలో సూర్యుని సంచారం కారణంగా కన్యా రాశి వారికి అదృష్టం దరిచేరుతుంది. రాబోయే నెల రోజుల్లో అనేక రంగాల వారికి కలిసొస్తుంది.
మీనరాశి
వృషభరాశిలో సూర్యుని ప్రవేశం వల్ల మీనరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. పాత కేసులు, గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా నిపుణుల అభిప్రాయం నుంచి సేకరించింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు)
Also Read: Remedies for Rahu: రాహు దోషంతో బాధపడుతున్నారా.. నివారణకు ఇదొక్కటే మార్గం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook