Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా? ఫైర్ బ్రాండ్ లీడర్ పై రాహుల్ గాంధీ టీమ్ పూర్తి నమ్మకంతో ఉందా? అంటే వరంగల్ రైతు సంఘ్షణ సభతో కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. వరంగల్ సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం... కొన్నాళ్లుగా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు ఒకేలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే రాహుల్ గాంధీ ప్రసంగం సాగిందనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ తో పొత్తు విషయంలో కుండబద్దలు కొట్టారు రాహుల్ గాంధీ. కేసీఆర్ తో తమకు ఎలాంటి సంబంధాలు ఉండవని స్పష్టం చేశారు. అంతేకాదు కేసీఆర్ పార్టీతో పొత్తు కావాలని కోరుకునే నేతలు కాంగ్రెస్ లో ఉంటే.. వాళ్లను సస్పెండ్ చేస్తామని కూడా రాహుల్ గాంధీ హెచ్చరించారు. కేసీఆర్ కావాలనుకునే నేతలు.. టీఆర్ఎస్ పార్టీలో చేరిపోవచ్చని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ పొత్తు విషయంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కూడా ఇదే ప్రకటన చేశారు. టీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. పొత్తులపై ఎవరూ మాట్లాడినా.. పార్టీ లైన్ తప్పినా సస్పెండ్ చేస్తామని కూడా రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో రేవంత్ చేసిన ప్రకటనలానే వరంగల్ సభలో రాహుల్ గాంధీ పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.దీంతో తెలంగాణ పార్టీ వ్యవహారాలపై రేవంత్ రెడ్డికి హైకమాండ్ పూర్తి స్వేఛ్చ ఇచ్చిందనే చర్చ గాంధీభవన్ తో పాటు రాజకీయ వర్గాల్లో సాగుతోంది. రాహుల్ భరోసా వల్లే రేవంత్ రెడ్డి గట్టిగా మాట్లాడుతున్నారని అంటున్నారు.
నిజానికి టీపీసీసీ చీఫ్ పదవి కోసం చాలా మంది నేతలు ప్రయత్నించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పేర్లు వినిపించాయి. కోమటిరెడ్డి చివరివరకు రేసులో నిలిచారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్లకు పీసీసీ పదవి ఇవ్వొద్దనే వాదన కూడా కొందరు తెరపైకి తెచ్చారు. కాని రాహుల్ గాంధీ మాత్రం రేవంత్ రెడ్డికే తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించారు. రేవంత్ కు పీసీసీ ఇవ్వడంపైనా కొందరు నేతలు ఓపెన్ గానే విమర్శలు చేశారు. తర్వాత కూడా ఆయనపై ఏఐసీసీకి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అందరిని కలుపుకుని పోవడం లేదని కూడా ఆరోపణలు చేశారు. అయినా హైకమాండ్ మాత్రం రేవంత్ విషయంలో తన పని తాను చేసుకుపోతోంది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డికి రాహుల్ ప్రీ హ్యాండ్ ఇచ్చారని, దూకుసుపోవాలని చెప్పారని తెలుస్తోంది. అందుకే సీనియర్లు ఇబ్బంది పెడుతున్నా రేవంత్ రెడ్డి జిల్లాలు చుట్టేస్తూ తన పని తాను చేసుకుంటున్నారని అంటున్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డికి క్రేజీ ఉందని.. ఆయనతోనే పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ భరోసాలో ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం. వరంగల్ సభతో రేవంత్ హవా పార్టీలో మరింత పెరుగుతుందని అంటున్నారు. పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు, రాహుల్ ప్రసంగం తర్వాత రేవంత్ రెడ్డి అనుచరులు ఫుల్ జోష్ లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇకపై పార్టీలో రేవంత్ కు వ్యతిరేకంగా పనిచేసే సీనియర్లు సైలెంట్ కాక తప్పదనే టాక్ కూడా గాంధీభవన్ లో వినిపిస్తోంది.
READ ALSO: teenmar mallanna shocking decision: కేసీఆర్‌ను తిట్టనని ఒట్టేసిన తీన్మార్ మల్లన్న
Lady Cop arrests Fiance : కాబోయే వాడిని కటకటాల వెనక్కి నెట్టిన సూపర్ కాప్.. ఎందుకంటే ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook