Kamareddy Road Accident: కామారెడ్డి రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం ప్రకటించారు.
కామారెడ్డి ప్రమాద ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ పల్లి గేటు వద్ద ఆదివారం (మే 8) సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. టాటా ఏస్ వాహనం, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను అంజవ్వ (35), వీరమణి (35), లచ్చవ్వ (60), సాయవ్వ (38), శైలు (35), ఎల్లయ్య (53), పోశయ్య (60), గంగవ్వ (45), వీరవ్వ (70)గా గుర్తించారు
మృతులంతా కుటుంబ సభ్యులు, బంధువులుగా గుర్తించారు. ఎల్లారెడ్డిపేటలో బంధువుల దశ దినకర్మకు వెళ్లి టాటా ఏస్ వాహనంలో తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అతివేగంతో నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Distressed by the loss of lives due to an accident in Kamareddy district, Telangana. Condolences to the bereaved families and prayers with the injured. Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of the deceased. The injured would be given Rs. 50,000: PM Modi
— PMO India (@PMOIndia) May 9, 2022
నిన్న ఎల్లారెడ్డి మండలం హాసన్ పల్లి గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో తొమ్మిది మంది మృత్యువాత పడటం అత్యంత బాధాకరం. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 9, 2022
Also Read: Happy Birthday Vijay Deverakonda: సమంత, పేరెంట్స్‌తో రౌడీ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్...
Also Read: Geetha Arts: గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా సునీత ధర్నా.. కారణం ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook