Warranty Guarantee Difference: మీరు దుకాణం నుంచి ఏదైనా ఖరీదైన వస్తువు కొనుగోలు చేసినప్పుడల్లా.. దాని గ్యారెంటీ, వారెంటీ గురంచి తప్పకుండా అడిగి తెలుసుకుంటారు. అయితే చాలా మంది గ్యారెంటీ, వారెంటీ రెండు ఒకటేనని భ్రమపడుతుంటారు. కానీ, ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఆ వ్యత్యాసం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్యారెంటీ అంటే?
ముందుగా గ్యారెంటీ అంటే ఏమిటో తెలుసుకుందాం. గ్యారంటీ అంటే కంపెనీ తన ఉత్పత్తి నాణ్యతకు పూర్తి బాధ్యత తీసుకుంటుంది. ఆ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన వస్తువులో చిన్న లోపం ఉన్నా.. దాన్ని రిపేర్ చేసేందుకు మెకానిక్ ను పంపుతారు. ఒకవేళ ఆ వస్తువులో పెద్ద లోపం ఉన్నట్లయితే పూర్తి వస్తువునే వెనక్కి తీసుకొని.. మరో కొత్త వస్తువును వినియోగదారులకు అందజేస్తారు.
వారెంటీ అంటే?
అదే సమయంలో వారంటీ అంటే లోపం చిన్నదైనా లేదా పెద్దదైనా.. కానీ కంపెనీ తన ఉత్పత్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోదు. అందుకు బదులుగా మెకానిక్ ను పంపి రిపేర్ చేయిస్తుందే తప్పా వస్తువును రిటర్న్ చేసుకోవడం అంటూ ఉండదు.
ఒకవేళ కొనుగోలు చేసిన ఉత్పత్తిని పూర్తిగా వెనక్కి తీసుకోవడం వల్ల సదరు కంపెనీకి ఎక్కువగా నష్టం ఉంటుంది కాబట్టి.. ఈ రోజుల్లో చాలా కంపెనీలు గ్యారెంటీకి బదులుగా వారెంటీని మాత్రమే కస్టమర్లకు అందజేస్తున్నారు. కస్టమర్ కోణంలో చూస్తే.. వారెంటీలోనూ పెద్దగా నష్టం లేదు. అయితే వారెంటీని ఎలా ఉపయోగించుకోవాలో మీరు స్పష్టంగా తెలుసుకోవాలి.
Also Read: Motorola Edge 20 Offers: రూ.8,499 ధరకే Motorola Edge 20 కొనేయండి!
Also Read: Realme Narzo 50 5G Launch: రియల్ మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్.. ఫీచర్స్ ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.